దేశసర్వోన్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఇదివరకే తండ్రి ఆస్తిలో తనయలకు కూడా సమాన వాటా ఉంటుందని పలు కేసులలో తీర్పులను వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా హిందూ కూతుళ్లకు తండ్రి ఆస్తిలో వాటా లభిస్తుందని మరో కేసు విషయంలోనూ తేల్చిచెప్పింది. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే, ఆయన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వారసులు లేని పక్షంలో తండ్రి మరణించడంతో ఆ ఆస్తులు దాయాదులు వారసులకు కాకుండా ఆయన కూతురికే చెందుతాయని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
హిందూ వారసత్వ చట్టానికి సంబంధించిన దాఖలైన ఓ కేసులో మద్రాసు హైకోర్టు తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేక అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును ఇచ్చింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ మహిళలు, వితంతువులకు ఆస్తి హక్కును పక్కాగా కల్పిస్తూ తీర్పును వెలువరించింది.
"ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. వారసుడు లేనప్పుడు, తన తండ్రి స్వీయ-ఆర్జిత ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమార్తెకు సంబంధించిన చట్టపరమైన సమస్యను ధర్మాసనం పరిష్కరిచింది. ఈ నేపథ్యంలో జస్టిస్ మురారీ నేతృత్వంలోని ధర్మాసనం ఏకంగా 51 పేజీల తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more