Armed with YouTube tricks, gang breaks open ATM యూట్యూబ్ వీడియోలు చూసి ఏటీయం చోరికి పాల్పడ్డ ముఠా

Based on info gathered from youtube gang carries out atm heist

Pune ATM robbery, ATM Heist, Bank of Maharashtra, ATM kiosk, Yavat town, Ajay Shende, Shivaji Garad, Rushikesh Kirtike, ATM break-ins, YouTube, equipment, online portal, Pune ATM heist, Daund, pune police, Pune, Maharashtra, crime

Pune Rural Police have busted a gang that allegedly broke open an ATM kiosk of Bank of Maharashtra (BoM) in Pune district’s Yavat town and fled with cash of Rs 23 lakh in the early hours of Monday. Police have so far arrested three persons in this case including the alleged kingpin Ajay Shende (32), Shivaji Garad (25) and Rushikesh Kirtike (22). Search is on for two of their accomplices.

యూట్యూబ్ వీడియోలు చూసి ఏటీయం చోరికి పాల్పడ్డ ముఠా

Posted: 01/21/2022 04:17 PM IST
Based on info gathered from youtube gang carries out atm heist

మనస్సుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పిన సామెతను తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ ముగ్గురు యువకుల ముఠా. ఏదైనా సాధించాలంటే అందుకు మార్గాలు కూడా ఉంటాయన్న పెద్దల మాటను వీరు రాత్రికి రాత్రే అక్రమమార్గంలో లక్షాధికారులు కావడానికి వినియోగించారు. ఏటీయం కేంద్రాల్లో డబ్బులు ఉంటాయని వీరికి తెలుసు. అయితే వాటిని ఎలా తెరవాలన్న విషయం మాత్రం వీరికి తెలియదు. దీంతో వాటిని రాత్రికి రాత్రే ఎలా తెరవాలో.. ఎలా దొంగలించాలో వీడియోలు చూశారు. అదేంటి ఇలాంటి వీడియోలు కూడా ఎక్కడ ఉంటాయని అంటారా.? అదేనండీ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు అనేకం.

అందులోనూ వీరు ఏటీయం తెరవడం ఎలా అన్న వీడియోలు చూసి.. అలానే ఏటీఎంను బ‌ద్ద‌లుకొట్టిన ఈ ముఠా.. రూ 23 ల‌క్ష‌ల‌తో ఉడాయించిన ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లాలోని యవ‌త్ ప‌ట్ట‌ణంలో సోమవారం తెల్ల‌వారుజామున జ‌రిగింది. ఏటీఎం దోపిడీకి సంబంధించి పక్కా సమాచారం అందడంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అజ‌య్ షెండె (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి దొపిడిలో సహకరించిన మ‌రో ఇద్ద‌రు నిందితుల‌ను శివాజీ గరద్, రుషికేష్ కిర్తికెలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏటీయం యంత్రాన్ని ఎలా తెరవాలన్ని విషయాన్ని ఎలా తెలుసునన్న పోలీసుల ప్రశ్నలకు వారు యూట్యూబ్ అని సమాధానం చెప్పడంలో పోలీసులు విస్మయానికి గురయ్యారు.

అజయ్ షెండె త‌న ఇద్ద‌రు అనుచ‌రులు రుషీకేష్ కిర్తికె (22), శివాజీ గ‌ర‌ద్ (25)తో క‌లిసి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే ఏటీయంను ఎలా తెరవాలో తెలుసుకునేందుకు వారు యూట్యూబ్ వీడియోలను చూశారు. ఇక ఏటీయం కొల్లగోట్టడానికి కావాల్సిన పరికరాలతో పాటు స్ర్పెలను కూడా అన్ లైన్ ఈ కామర్స్ సైట్ల నుంచి తెప్పించుకున్నారు. పోలీసులు తమను గుర్తించకుండా వుండేందుకు ఏటీయం కేంద్రంలోని ప్రవేశించగానే సిసిటీవీ కెమెరాలు తమను బంధించకుండా వాటిపై స్ర్పే చేశారు. ఇక తాము వచ్చిన పని కానిచ్చేశారు. యూట్యూబ్ లో చూసిన వీడియోల ద్వారా ఏటీయం యంత్రాలను తెరచి వాటిలోంచి ఏకంగా 23 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు.

అప్పటికే పలు ఇళ్లు, ఇతర దోంగతనాలకు పాల్పడిన అజయ్ షిండే ఈ ఏటియం కేంద్రం దొపిడికి పాల్పడ్డారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిండంతో విషయం బయటపడింది. యవ‌త్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర ఏటీఎంలోకి వెళ్లిన ఈ ముఠా సెక్యూరిటీ కెమెరాల‌ను బ్లాక్ చేసి.. గ్యాస్ క‌ట్ట‌ర్‌తో ఏటీఎం మిష‌న్‌ను తెరిచి డబ్బుతో ప‌రారైంది. నిందితుడి నుంచి ఓ బైక్‌, రూ ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. కాగా కుర్కుంభ్‌లో ఏటీఎం పగలకొట్టడానికి ప్రయత్నించడం, వాషిమ్‌లో తాళం వేసిన ఇంటిలోకి చోరబడటం, గేట్‌గావ్ వద్ద ఏటీఎంను తెరిచి రూ. 7.67 లక్షల చోరీ, లోనికల్‌భోర్ ప్రాంతంలో వాహనాల చోరీలు సహా మరో నాలుగు నేరాల్లో ఈ ముఠా ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh