Channi or Sidhu; Who is Cong' CM face in Punjab? పంజాబ్ సీఎం చన్నీ అలా.. పిసీసీ అధ్యక్షుడు సిధ్దూ ఇలా..!

Congress hints channi as cm face for punjab polls sidhu camp plays it down

Punjab Assembly elections, Congress, CM candidate. Charanjit Singh Channi, Punjab elections, BJP, AAP, Punjab Politics

In the Punjab Assembly elections, the pressure is increasing on the Congress party to announce the candidate for the post of CM. Who will be the chief minister's face from the Congress party for the Punjab elections, it has not been formally announced yetIt is being told that Congress can contest Charanjit Singh Channi from two seats. It has been announced that Channi will contest from Chamkaur Sahib seat.

పంజాబ్ సీఎం చన్నీ అలా.. పిసీసీ అధ్యక్షుడు సిధ్దూ ఇలా..!

Posted: 01/22/2022 11:18 AM IST
Congress hints channi as cm face for punjab polls sidhu camp plays it down

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్​ అధిష్టానం పంజాబ్​ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన తనదైన శైలీలో స్పందించి జవాబిచ్చారు. కాంగ్రెస్​ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. పార్టీ కోసం తాము సేవకుల మాదిరిగా కష్టపడతామే తప్ప.. పదవుల కోసం కాదని అన్నారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి చన్నీ..  పంజాబ్ మాజీ సీఎం అమరీందర్​ సింగ్​పై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలతో పాటు ప్రజల ప్రయోజనాలను పన్నంగా పెట్టిన అమరీందర్ కు ఈ ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని విమర్శించారు. కాగా, ఇటీవల ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ పంజాబ్​ సీఎం​ అభ్యర్థిగా భగవంత ​మాన్​ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్​ పంజాబ్​ నుంచి నాయకుడిగా ఎదగాలని అనుకున్నారని కానీ.. పంజాబ్​ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్​ మాన్​​ పేరును ప్రతిపాదించారని తెలిపారు.

అయితే సీఎం చన్ని కన్నా ముందుగానే ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా స్పందించారు. త‌న‌కు అధికార దాహం లేద‌ని, పంజాబీల ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా పోరాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్ సీఎం ప‌ద‌వికి తాను పోటీలో లేన‌ని చెప్పారు. సిద్ధూ ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు ముచ్చటించారు. రాష్ట్రంలో సీఎం అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించ‌కుండా ముందుకెళ్లాల‌న్న‌ది పార్టీ అధిష్టాన‌వ‌ర్గం నిర్ణ‌యమ‌ని చెప్పారు. తాను ఎలాంటి ప‌ద‌వికీ రేసులో లేన‌ని అన్నారు. పంజాబ్ ప్ర‌జ‌ల కోసం అంకిత‌భావంతో ప‌నిచేస్తాన‌ని అన్నారు. బీజేపీ త‌న‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుని ల‌బ్దిపొందింద‌ని చెప్పారు.

కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని బీజేపీ చెప్పిన‌ట్టు ఆడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అభివృద్ధిపై చ‌ర్చ‌కు రావాల‌ని ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌కు సిద్ధూ స‌వాల్ విసిరారు. కేజ్రీవాల్ క్యాబినెట్‌లో ఒక్క పంజాబీ కూడా లేడ‌ని అన్నారు. కెప్టెన్ సింగ్‌, చ‌న్నీ హ‌యాంలో ప్ర‌భుత్వ విధానాల‌నే తాను ప్ర‌శ్నించాన‌ని సొంత పార్టీ స‌ర్కార్‌ల‌తో విభేదించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. పంజాబ్ అసెంబ్లీఎన్నిక‌ల్లో పాల‌క కాంగ్రెస్‌తో ఆప్, అకాలీద‌ళ్, బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూట‌మి త‌ల‌ప‌డుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 20న ఒకే ద‌శ‌లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh