Online fraud: Man promised job in UK, duped of Rs 11 Lakh సైబర్ నేరం: విదేశాల్లో ఉద్యోగం పేరుతో.. రూ.11.14 లక్షల శఠగోపం..

Hyderabad man duped of 11 14 lakh on false assurance of job in the uk

Online fraud, Job Online fraud, Online Job fraud, UK job fraud, Online resume, any desk, cyber crime, documents, visa, Chennai RBI, RBL Bank, Himayathnagar, Hyderbad, Telangana, Crime

Online fraudsters allegedly duped a city-based man to the tune of ₹11.14 lakh on false assurance of providing him with a job for a managerial position in the United Kingdom. The man was made to pay money through various bank transactions

సైబర్ నేరం: విదేశాల్లో ఉద్యోగం పేరుతో.. రూ.11.14 లక్షల శఠగోపం..

Posted: 01/21/2022 01:05 PM IST
Hyderabad man duped of 11 14 lakh on false assurance of job in the uk

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఎంతో వేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నామని సంబరపడిపోతున్నాం. అయితే అదే వేగంతో అవతలివారి మాయలో పడతే మాత్రం నిట్టనిలువునా మునిగిపోతాం. ఎదుటివారిని బుట్టలో దింపి వారిని మోసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్ల వెయి కళ్లతో నిత్యం నిఘా పెడుతూనే వుంటాయి. ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా లేకపోతే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బంతా క్షణపాటులో కోల్పోయినవారు అవుతారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్లో జరిగింది. బ్రిటెన్ లో ఉద్యోగం కల్పిస్తామంటూ నమ్మించి.. శఠగోపం పెట్టిన సైబర్ నేరగాడి వలలో చిక్కిన నగరవాసి ఏకంగా పదకొండు లక్షల 14 వేల రూపాయలను కోల్పోయాడు.

అన్ లైన్ లో రెజ్యూమ్ అప్ లోడ్ చేయగానే ఇక్కడ జాబులేంటి..  మీ రెజ్యూమ్ చూశాను.. మీ చదవుకు తగ్గ ఉద్యోగం మంచి వేతనం కావాలంటే లండన్ బెటర్. ఇక్కడ వేలలో సంపాదించే కంటే అక్కడ లక్షల్లో సంపాదన అంటూ ఆశపెట్టి మరీ బుట్టలోకి దింపాడు. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవి తాను చూసుకుంటానన్నాడు. ఒప్పుకునే వరకు ఒప్పించేలా చాలా కష్టపడతారు. సర్లే ఊ అన్నావా.. వారి ఉచ్చులో పడ్డటే. ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్‌ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్‌ని ఆన్‌లైన్‌ పెట్టాడు. రెజ్యూమ్‌ చూసిన సైబర్‌ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు.

అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్‌ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్‌ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్‌ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి నగర వాసి అకౌంట్‌లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles