హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్ అలజడి సృష్టించాడు. ఏకంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలిస్ కమీషనరేట్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరాడు. మూడు కమీషనేరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్లకు పాల్పడిన అగంతకుడు ఏకంగా ఏడు నేరాలు చేసినట్లు తేలింది. ఉదయం అల్వాల్‌లో నేరాలను ప్రారంభించిన అగంతకుడు సాయంత్రానికి మేడిపల్లిలో ముగించాడు. ఈ ఏడింటిలోనూ మొదటి రెండూ విఫలం కాగా... ఆ తర్వాత ఐదు చైన్ స్నాచింగులలో ఏకంగా 18.5 తులాల బంగారం నగలను మహిళల మెడలోంచి కొట్టేశాడు. ఒంటరి మహిళలే టార్గెట్ గా చేసుకున్న అగంతకుడు ఉప్పల్ లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఆ అగంతకుడి కోసం మూడు పోలీసు కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు గాలిస్తున్నారు. ఆసిఫ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిర్రా రోడ్లో యాక్టివా వాహనం చోరీ చేసిన ఈ స్నాచర్ బుధవారం ఉదయం తన ‘పని’ మొదలెట్టాడు. అల్వాల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన పుష్ప ఇళ్లల్లో పని చేస్తుంటారు. పనులు ముగించుకున్న ఈమె ఉదయం 10.45 గంటలకు కానాజీగూడ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గోలుసును బంగారంతో చేసిందిగా భావించిన స్నాచర్ వెనుక నుంచి వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడ నుంచి వాహనంపై పారిపోయాడు.
రోల్డ్ గోల్డ్ గోలుసు అయినా తనలా మరో మహిళ మెడలోంచి గొలుసులు దొంగలించకూడదన్న ఉద్దేశ్యంతో ఆమె మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి వెళ్లిన చైన్ స్నాచర్ ఉమారాణి మెడలో గొలుసు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అమె కూడా గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ రెండూ విఫలం కావడంతో.. రాఘవేంద్ర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, మారేడ్‌పల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ, తుకారాంగేట్‌లోని సమోసా గార్డెన్స్, మేడిపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో పంజా విసిరాడు. సాయంత్రం 4.30 గంటలకు ఆఖరి నేరం చేసిన చైన్ స్నాచర్ అక్కడ నుంచి ఉప్పల్ వరకు వచ్చాడు.
ఈ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉప్పల్‌లోని ఓ గల్లీలోకి ప్రవేశించిన దుండగుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నాగోల్, హబ్సిగూడ, రామాంతపూర్ రోడ్లలోని కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతడు ఎక్కడి వాడు? ఎక్కడ బస చేశాడు? కొన్ని నేరాలకు మధ్య సమయంలో ఎక్కడ ఉన్నాడు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ అగంతకుడు నగరంలోని కాలనీలన్నీ కొట్టిన పిండిలా తిరగాడటంతో నగరానికి చెందని వ్యక్తనే.. లేక నగరంపై పట్టున్న సమీప జిల్లాలకు చెందిన వ్యక్తా.? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more