ప్రముఖ సినీ దర్శక, నిర్మాత దివంగత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా తన కారును నడుపుతూ.. రోడ్డుపై పార్క్ చేసివున్న ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాహనాలను ఢీకొట్టిన తరువాత ఆయన తన కారును ఆపకుండా వెళ్లిపోవడంతో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు ఆయన కారును చేధించి అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే కారు నుంచి దిగిన ఆయన మద్యం మత్తులో వీరంగం సృష్టించారని పోలీసులు తెలిపారు.
పోలీసులు కథనం ప్రకారం బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్ కు దాసరి అరుణ్ కుమార్ తన కారులో వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన రోడ్డు పక్కన పార్క్ చేసివున్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీంతో వాహనదారులు అరుస్తున్నా పట్టించుకోని అరుణ్ కుమార్ తన కారును ఏ మాత్రం అపకుండా ముందుకు వెళ్లారు. దీంతో పెట్రోలింగ్ లో వున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కారును చేధించారు. కారును నడుపుతున్న దాసరి అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో పూర్తిగా ధ్వంసమైన ద్విచక్ర వాహనం యజమాని సయ్యద్ అఫ్జల్.. సహా పలువురు వాహనదారులు దాసరి అరుణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపించిన దాసరి అరుణ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 279, 336, మోటారు వాహనాల చట్టంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఆయన ఇవాళ బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయనను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more