కరోనా మూడో విడత నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్యు నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కరోనా తోలి, రెండో దశలో దాని బారిన పడిన వారిలో యాంటీబాడీలు ఉంటాయని, దీంతో వారు మరలా కరోనా బారిన పడరని వచ్చిన కొన్ని వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే అద్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరీముఖ్యంగా హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో ప్రతి మూడింటిలో ఒకటి గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడి, మళ్లీ ఇన్ఫెక్షన్ కు గురైనవే (రీ ఇన్ఫెక్షన్) ఉంటున్నాయి. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నవారు కూడా మరోమారు కరోనా బారిన పడటం అందోళనకరం.
మొదటి లేదా రెండో విడతలో కరోనా బారిన పడిన వారు మళ్లీ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే తొలి, రెండవ దశలో కరోనా నుంచి కోలుకునేందుకు అధిక సమయం పట్టిందని, దీంతో పాటు అసుపత్రులలో చేరాల్సి వచ్చిందని.. ఇక లక్షణాలు కూడా తీవ్రంగా ఉండేవి. కాగా, మూడవ విడతలో ఎక్కువ మందిలో లక్షణాలు లేకపోవడం, ఉన్నా కానీ, స్వల్పంగా కనిపిస్తుండటం ఆశాజనకం. కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఓ వ్యక్తి కోలుకునేందుకు నెల పట్టింది. కానీ, ఇప్పుడు పాజిటివ్ గా మరోసారి వచ్చినా లక్షణాలు ఏవీ లేవని తెలిపాడు. మరో గృహిణి సైతం ఐదు నెలల విరామంతో రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
దీనిపై కేర్ హాస్పిటల్స్ గ్రూపు సీఈవో రాజీవ్ సింఘాల్ స్పందిస్తూ.. ‘‘మా ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసులు 20-25 శాతంగా ఉంటున్నాయి. ఎక్కువ కేసుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. వారికి ఔట్ పేషెంట్ గానే చికిత్స అందిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికీ డెల్టా కేసులు వస్తూనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘‘రీ ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగానే వస్తున్నాయి. చాలా వరకు పురోగతి ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రెండు డోసుల టీకా తీసుకున్న వారు సైతం.. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు. 30 శాతం మేర ఇవే కేసులు ఉంటున్నాయి’’ అని ఎస్ఎల్జీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ ప్రదీప్ పాణిగ్రాహి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more