బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువును చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. బీహార్ లోని కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అయితే బిడ్డతో పాటు తల్లి కూడా క్షేమంగా వున్నారని వైద్యులు తెలిపారు. అసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుకున్న మహిళ భర్త, కుటుంబసభ్యులు, బంధువులు వింత శిశువు జన్మించడంపై అసుపత్రివర్గాలను నిందిస్తున్నారు. శిశువును స్కానింగ్ చేసిన సందర్భంలో కానీ.. బిడ్డ జన్మించేందుకు ముందు జరిగిన పరీక్షల సమయంలో కానీ వైద్యులు ఈ మేరకు తమకు ఎలాంటి సూచనలు చేయలేదని వారు అరోపిస్తున్నారు.
సదర్ అసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని మహిళ భర్త అరోపిస్తున్నారు. తనకు వింత శిశువు జన్మించిందని అసుపత్రివర్గాల ఫోన్ ద్వారా సమాచారం అందించాయని తెలిపారు. అది విని తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. వైద్యులు అన్ని పరీక్షలు చేస్తూ వచ్చి.. అంతా సవ్యంగానే వుందని చెప్పారని, ఇప్పుడు ఇలా మాటమార్చడంలో తమ నిర్లక్ష్య వైఖరే కారణమని అరోపించారు. మహిళ గర్భంలో కవలలు జన్మనివ్వాల్సి ఉందని, అయితే గర్బస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెప్పడాన్ని మహిళ బంధువులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన భార్య గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఈ విషయం ఎప్పుడూ బయట పడలేదన్నారు. వైద్యులు కూడా లోపల శిశువు సరిగా పెరగడం లేదన్న విషయాన్ని తమతో చెప్పలేదని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వింత శిశువును చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. కాగా, ఈ శిశువును దేవతగా భావించిన కొందరు మొక్కుతుండటం కూడా గమనార్హం. శిశువును ఫోటోలో, వీడియోలు తీసిన కొందరు నెటిజనులు వాటిని సోషల్ మీడియాలోనూ అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more