Vijay Mallya loses battle to keep London home లండన్ నడివీధుల్లో విజయ్ మాల్యా.. ఇళ్లును లాగేసుకున్న బ్యాంక్

Vijay mallya set to be evicted from luxurious london home as he loses court battle

vijay mallya, vijay mallya london home, Cornwall Terrace luxury apartment eviction, Regent’s Park Home encforcement order, London Home enforcement order, rose capital ventures, mortagage loan, siddharth mallya, Lalitha Mallya, Swiss bank UBS, Mallya plush home, British court, Regent's park Home, London Home, London, Crime

Businessman Vijay Mallya lost a legal battle to hold on to his plush London home after a British court refused to grant him a stay of enforcement in a long-running dispute with Swiss bank UBS. The 18/19 Cornwall Terrace luxury apartment overlooking Regent’s Park in London, is currently being occupied by Mallya’s 95-year-old mother Lalitha.

లండన్ నడివీధుల్లో విజయ్ మాల్యా.. ఇళ్లును లాగేసుకున్న బ్యాంక్

Posted: 01/19/2022 12:59 PM IST
Vijay mallya set to be evicted from luxurious london home as he loses court battle

లండన్ కు పారిపోయిన భారత ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా ఇప్పుడు నిలువనీడ కరువై నడిరోడ్డున పడ్డాడు. కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చుపెట్టి అత్యంత విలాసవంతమైన వ్యాపారవేత్తగా, లిక్కర్ కింగ్ గా ప్రసిద్దిగాంచిన ఆయన తనకంటూ కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌ ఇమేజ్ ను సోంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నిజజీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. ప్రజల డబ్బుతో విదేశాలకు ఉడాయిచిన ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో లండన్‌లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది.

స్విట్జర్లాండ్ కు చెందిన యూబీఎస్‌కు 20.4 మిలియన్‌ బ్రిటన్‌ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్‌ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదాలు పడుతూవస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్‌లోని రిజెంట్‌ పార్క్‌లో ఉన్న కార్న్‌వాల్‌ టెర్రస్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్‌ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్‌ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్‌ హైకోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్‌ మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది.

లండన్‌ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్‌ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు.  వేరే బెంచ్‌కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్‌ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్‌ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు.

లండన్‌లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్ మెంట్ లో అతని కొడుకు సిద్ధార్థ్ మాల్యా (34)తో పాటు విజయ్‌ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు 95 ఏళ్లు. భారత్‌ బ్యాంకులను కోట్లాది రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్ కు విజయ్‌మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ యాచ్‌లే ఉన్నాయి.  కానీ స్విట్జర్లాండ్‌ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్ మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles