Minister Harak Singh Rawat likely to join Congress బీజేపికి షాకివ్వనున్న ఉత్తరాఖండ్ మంత్రి.. త్వరలో కాంగ్రెస్ లో చేరిక..

Uttarakhand assembly polls bjp minister harak singh rawat likely to join congress

Shock to BJP, Harak singh, election news, medical college, Pushkar Singh Dhami, Governor Gurmit Singh, Governor Gurmit Singh,Uttatakhand Assembly Elections 2021, Uttatakhand elections, Minister to join Congress, BJP, Congress, Uttatakhand, Politics

Uttatakhand minister Harak Singh Rawat, had threatened last month to resign from the post during a Cabinet meeting chaired by the Chief Minister. He stormed out of a cabinet meeting upset over alleged “government inaction” over a proposed medical college in Kotdwar, from where he is the MLA.

బీజేపికి షాకివ్వనున్న ఉత్తరాఖండ్ మంత్రి.. త్వరలో కాంగ్రెస్ లో చేరిక..

Posted: 01/17/2022 01:13 PM IST
Uttarakhand assembly polls bjp minister harak singh rawat likely to join congress

ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన మంత్రి హరక్ సింగ్ రావత్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపిన ఆయన.. ఇవాళ లాంఛనంగా పార్టీలో చేరి కండువాను కప్పుకోనున్నారు. బీజేపి ప్రభుత్వం తన అసెంబ్లీ నియోజకవర్గమైన కోట్‌ద్వార్ లో మెడికల్ కాలేజీని స్థాపిస్తామని హామి ఇచ్చి.. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆయన అరోపించారు. దేవభూమిగా వర్ధిల్లుతున్న ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు సమీకరణలతో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే నువా-నేనా అన్నట్లు ఇక్కడి ఎన్నికల సంగ్రామం నెలకొందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ గూటికి చెందిన హరక్ సింగ్ రావత్ బిజెపి అధిష్టాన నిర్ణయాలను ఫాలో కావడం లేదని.. ఇక గత ఐదేళ్లలో పదేపదే సమస్యలను సృష్టించారని బీజేపి నేతలు అరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపి కార్యకర్తలలో కూడా ఆయనపై అసంతృప్తి ఉందని.. రావత్ తో పాటు 2016లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలు, కార్యకర్తలకే అదిక ప్రాధాన్యత ఇచ్చారని.. పార్టీ అధిష్టాననికి బీజేపి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా బీజేపీ అరోపించింది. బీజేపిలో ముఠా నాయకత్వాలకు అస్కారం లేదని అక్షేపించింది. నియోజకవర్గ స్థాయిలో బీజేపి కార్యకర్తలతోనూ ఆయన సమన్వయం చేసుకోవాలని బీజేపి నాయకత్వం తెలిపింది.

దీంతో పాటు ఆయన ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సమావేశంలోనూ ఆయన దురుసుగా వ్యవహరించి.. తన డిమాండ్లు పరిష్కరించకపోతే పార్టీ నుంచి వైదోలగిపోతానని తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తి చసిన ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారని బీజేపి వర్గాలు తెలిపాయి. అయితే ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయంలో ఆగ్రహంతో వెళ్లిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని.. కేవలం తన కుటుంబసభ్యులకు పార్టీ టికెట్ల కోసం డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానంపై ఒత్తడి తీసుకువచ్చారని అందుచేత పార్టీ ఆయనను బర్తరఫ్ చేసిందని బీజేపి వర్గాలు తెలిపారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన కోడలు అనుకృతి గోసైన్‌తో పాటు అతని మద్దతుదారుల్లో ఒకరికి టిక్కెట్లు ఇవ్వాలని రావత్ బిజెపి అగ్రనాయకులపై ఒత్తిడి తెచ్చారని వార్తలు బయటకోచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై బీజేపి అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వచ్చాయి. అందుకు ఇవాళ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు తన కొడలికి టికెట్ హామీ లభిస్తేనే పార్టీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles