యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. కొత్త సవత్సరం వేళ ఆయన ఇంట్లోనే కాదు తన కుటుంబం జీవితంలోనూ వెలుగులు నింపేలా.. అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. అయితే డ్రా తీయడానికి కొద్ది గంటలకు ముందు సదానందన్.. తన ఇంట్లోకి మాంసం తీసుకోద్దామని మార్కెట్ కు వెళ్లాడు మార్గమధ్యంలో సెల్వన్ అనే లాటరీ విక్రేత కలవడంతో ఆయన వద్ద లాటరీ కొన్నాడు.. ఇక అటు నుంచి అటే మాంసం దుకానానిక వెళ్లి మాంసం తీసుకుని ఇంటికి వెళ్లాడు.
కొద్ది సేపటికీ లాటరీ టికెట్ ను జేబులోంచి తీసి.. నెంబర్ చెక్ చేసుకన్నాడు. తన లాటరీ టికెట్ నెంబరు ‘ఎక్స్‌జి 218582’. దీంతో తన లాటరీ టికెట్ డ్రా తీసారిని తెలుసుకున్న సదానందర్ ఫలితాలను చెక్ చేసుకుంటే ఆయన కొన్న టికెట్‌కు జాక్ పాట్ లభించింది. అంతే ఆయన అనందానికి అవధులు లేవు. ఆయన టికెట్ కు ఏకంగా రూ. 12 కోట్లు తగిలింది. అయితే ఇందులో ఏకంగా 40శాతం మేర పన్నులు పోను ఏకంగా రూ. 7 కోట్ల వరకు సందానందన్ కు లభించనుంది. అయితే తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. తన కుమారులకు మంచి ఇళ్లు, భవిష్యత్తు కల్పించడానికి ఈ లాటరీ ద్వారా లభించిన ధనాన్ని వినియోగిస్తానని చెప్పాడు.
కాగా సదానందన్ కొన్న క్రిస్టమస్ న్యూఇయర్ లాటరీ టికెట్ ధర కేవలం రూ.300. ఇక ఈ లాటరీ రెండవ బహుమతులుగా రూ. 3కోట్ల (ఆరుగురికి) మూడవ బహుమతులు రూ.60 లక్షలు (ఆరుగురికి) అందించినట్లు లాటరీ యాజమాన్యం తెలిపింది. ఇదిలావుండగా ఈ లాటరీ నిర్వహణ కోసం ముందుగా నిర్ణయించినట్లు ఏకంగా 24 లక్షల టికెట్లను ప్రభుత్వం తొలుత ముద్రంచి విక్రయించింది. ఆ తరువాత రెండో పర్యాయం కూడా ఏకంగా 9 లక్షల టికెట్లను ముద్రించి విక్రయించింది. ఇక చివరగా మూడవ పర్యాయం ఏకగా 8.34 లక్షల టికెట్లను విక్రయించగా, అందులోంచి సదానందర్ కొన్న టికెట్ల్ కు మాత్రమే తొలి బహుమతి లభించింది. ఇక గత సెప్టెంబర్ లోనూ ఓ అటో డ్రైవర్ కు ఈ లాటరీ ప్రైజ్ గెలుచుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more