Coronavirus: IndiaRecords 2.58 Lakh Fresh Covid Cases దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. రెండు లక్షలకు చేరువలో కేసులు

2 58 lakh new covid cases in india positivity up from 16 28 to 19 65

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

India's Covid curve showed marginal improvement today as the country reported 2.58 lakh cases, which is around 5 per cent lower than yesterday. As many as 385 people have died of Covid during the past 24-hour period, according to the Health Ministry. The country's caseload now stands at 3.73 crore. This includes 8,209 cases of the Omicron variant which is now present in 29 states.

దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. 2.58 లక్షల కేసులు

Posted: 01/17/2022 11:22 AM IST
2 58 lakh new covid cases in india positivity up from 16 28 to 19 65

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసుల రెండు లక్షల 56 వేల మేరకు నమోదయ్యాయి. ఆదివారం నాటి కేసుల కంటే ఇవి 4.43 శాతం తక్కువని అధికారులు తెలిపారు. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు కూడా 16,56,341 దాటడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసులు 3,73,80,253కి చేరాయి. ఇందులో 3,49,33,981 మంది కోలుకున్నారు. మరో 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,86,451 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 385 మంది మృతిచెందగా, 1,51,740 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా అధికమవుతున్నది. నిన్న 16.28 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.65 శాతానికి చేరిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 158.12 కోట్ల కరోనా వ్యాక్సిడ్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి.

దీంతో మూడు వారాల వ్యవధిలో రోజువారీ కేసులు రెండున్నర లక్షలకు చేరువయ్యాయి. ఇక అదే సమయంలో దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా క్రమంగా అధిమవుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్‌ బాధితులు 8209కి చేరారు. ఇందులో 3109 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1738 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో 1672, రాజస్థాన్‌లో 1276, ఢిల్లీలో 549, కర్ణాటకలో 548, కేరళలో 536 చొప్పున కేసులు ఉన్నాయి. దేశంలోని 120 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివ్ రేటు కూడా స్వల్పంగా తగ్గింది. తాజాగా 14.41గా పాజిటివిటీ రేట్ నమోదైంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles