Third UP Minister Dharam Singh Saini Quits BJP బీజేపి గుడ్ బై చెప్పిన మరో మంత్రి, ఎమ్మెల్యే..

Bjp faces spate of defections ahead of assembly elections in uttar pradesh

Dharam Singh Saini, third minister, backward caste leader, Nakud MLA, Swami Prasad Maurya, Yogi Adityanath government, Akhilesh Yadav, Samajwadi Party, Mayawati's Bahujan Samaj Party (BSP), backward caste leader, Mukesh Verma, Uttar Pradesh, Politics

The Yogi Adityanath government in Uttar Pradesh on Thursday lost a third minister and backward caste leader, Dharam Singh Saini, who had earlier hotly denied that he was quitting the BJP. This is the eighth exit from the BJP in three days, with a crucial election less than a month away. They are all tipped to join Akhilesh Yadav's Samajwadi Party.

బీజేపి గుడ్ బై చెప్పిన.. మరో మంత్రి ధరమ్ సింగ్, ఎమ్మెల్యే ముఖేష్ వర్మ

Posted: 01/13/2022 08:19 PM IST
Bjp faces spate of defections ahead of assembly elections in uttar pradesh

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. గత మూడు రోజులలో బీజేపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గెడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామాతో ఆ సంఖ్య ఏకంగా ఏడుకు చేరింది. వెనకబడిన కులాల నేత ముఖేశ్ వర్మ బీజేపి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వామి ప్రసాద్ మౌర్య ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై పలు విమర్శలు సంధించారు. బిసి నేతలందరూ ఒకే విధంగా యోగీ సర్కార్ బిసిలను, దళితులను పట్టించుకోలేదని, కనీసం ఆయా వర్గాల నేతల మనోభావాలకు కూడా విలువ ఇవ్వలేదని.. అయినా.. ఎన్నికల తరుణం వరకు ఓపిక పట్టి ఆ పార్టీలోనే కొనసాగామని చెప్పుకోచ్చారు.

ఇక ఉత్తర్ ఫ్రదేశ్ లోని యోగీ అధిత్యనాథ్ సర్కారు నుంచి సమాజ్ వాదీ పార్టీలోకి చేరిన బిసీ వర్గాల నేత, యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బాటలోనే ఆయన నడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ. తన రాజీనామా లేఖలో బీజేపీపై వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల గొంతుకగా ఆయన అభివర్ణించారు. ఆయనే తమ నాయకుడని అన్నారు. యూపీలో ఐదేళ్ల పాలనలో దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ సామాజికవర్గాలకు చెందిన నేతలకు తగిన గౌరవాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు. రైతులు, నిరుద్యోగ యువత, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణాల వల్లే తాను బీజేపీని వీడుతున్నానని చెప్పారు.

బీజేపికి వీడ్కోలు పలికిన మరో మంత్రి.. ఎస్పీలో చేరిక..

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి మరో మంత్రి వైదోలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మూడవ మంత్రి, వెనుకబడిన కుల నాయకుడు ధరమ్ సింగ్ సైనీని కోల్పోయింది, బీజేపి నుంచి వైదోలిగిన తరువాత స్వామి ప్రసాద్ మౌర్య తన వెంట చాలా మంది బిసి నాయకులు అనసరిస్తూ సమాజ్ వాది పార్టీలో చేరుతారని చెప్పారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న ధరమ్ సింగ్ సైనిని మీడియా ప్రశ్నించగా, ఆ వార్తలలో పసలేదని, తాను బిజెపిని విడిచిపెడుతున్నట్లు వస్తున్న వార్తలు సత్యదూరమని ఖండించారు. అయితే ఇలా చెప్పిన 24 గంటలు తిరిగితిరక్కముందే ఆయన కూడా బీజేపి పార్టీకి వీడ్కోలు పలికి.. సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అయితే ఆయనను పార్టీ వీడవద్దని యోగీ అదిథ్యనాథ్ స్వయంగా ఫోన్ చేసి.. బుజ్జగింపు చర్యలకు దిగినా ఫలితం లేకుండా పోయింది.

"స్వామి ప్రసాద్ మౌర్య యొక్క జాబితాలో నా పేరు తప్పుగా ఇచ్చారని, అలా వారు ఎందుకిచ్చారో నాకు తెలియదు. నేను బిజెపిలో ఉన్నాను.. ఉంటాను. నేను పార్టీని వీడటం లేదు," అని సైనీ ఒక మీడియా ప్రతినిధితో అన్నారు. అలా వ్యాఖ్యనించిన ఆయన 24గంటలలోపు ఎస్పీ పార్టీలో చేరారు. సహరన్‌పూర్‌లోని నకుడ్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ధరమ్ సింగ్ సైని.. ఆ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో బిజెపి నుండి ఎనిమిదవ నేత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ వరుస పలయనాలు బీజేపి పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. వీరంతా అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీలో స్వామి ప్రసాద్ మౌర్యతో కలసి శుక్రవారం చేరనున్నట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh