Hospitalisation of children with Covid-19 rises in Hyderabad చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం: ఆసుపత్రుల్లో చేరుతున్న శిశువులు..

Is omicron wave leading to more hospitalisations in children in hyderabad

Coronavirus, Covid, Covid vaccine, Covid cases in India, children, COVID-19, COVID-19 pandemic in india, COVID-19 pandemic, children Omicron variant, Hyderabad Covid 19,rainbow hospitals,covid 19,family members,children Covid-19,testing positive,Hyderabad Children Hospitalisation, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

Hospitalisation of children with Covid in Hyderabad is going up. Majority of the cases have mild symptoms. Doctors are saying that the children getting infected may have picked up the infection from one of their family members, the report said.

చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం: ఆసుపత్రుల్లో చేరుతున్న శిశువులు..

Posted: 01/11/2022 04:19 PM IST
Is omicron wave leading to more hospitalisations in children in hyderabad

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు మాటువేసింది. మరీ ముఖ్యంగా వాక్సీన్ వేయించుకున్న వారి నుంచి చిన్నారులకు సోకుంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ బారినపడి అసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. నూతన సంవత్సర ఆరంభం నుంచి పరిశీలిస్తే.. గత పది రోజులగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇదివరకే అగ్రరాజ్యం అమెరికా, బ్రిటెన్ సహా పలు దేశాల్లో నమోదవుతున్నట్లుగానే మన దేశంలోనూ చిన్నారులు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. రోజూ ముగ్గురు నుంచి ఐదుగురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే ఈ చిన్నారులతో పాటు ఏడాదిలోపు శిశువులు కూడా ఒమిక్రాన్ బారిన పడటం గమనార్హం.

పలువురు శిశువుల్లో ఒమిక్రాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మూడు నెలల్లోపు శిశువులకు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు వస్తాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే చిన్నారులకు, శిశువులకు కుటుంబంలోని మిగతా సభ్యుల ద్వారా ఒమిక్రాన్ బారిన పడుతున్నారని పిడియాట్రిషన్లు చెబుతున్నారు. బయట నుంచి వచ్చి నేరుగా చిన్నారులు చెంతకు తీసుకోవడం ముఖ్యకారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. అయితే ఇలా వైరస్ బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. రెండు రోజుల పాటు స్వల్ప స్థాయి జ్వరం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం రావడంతో చిన్నారులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిలోనూ కేసులు బయటపడుతున్నాయి.

మరోపక్క, నీలోఫర్ ఆసుపత్రిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం ఒక్కసారిగా వస్తున్నాయని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ‘‘ఫ్లూ, కోవిడ్  మధ్య తేడాలను గుర్తించడం కష్టం. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కరోనా టీకాలను తీసుకున్నవారే. వీరికి కరోనా సోకినా లక్షణాలు పెద్దగా కనిపించడంలేదు. అయితే, వీరి నుంచి పిల్లలకు కరోనా సోకుతున్నట్టు తెలుస్తోంది’’ అని ఓ వైద్యుడు పేర్కొన్నారు. ‘‘గత కొన్ని రోజులుగా కేసులు పెరగడం చూస్తున్నాం. ఎక్కువ శాతం అవుట్ పేషెంట్, ఆన్ లైన్ కన్సల్టేషన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి రోజుకు నాలుగైదు అడ్మిషన్లు కూడా కనిపిస్తున్నాయి’’ అని లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ ఘంటా తెలిపారు.

ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 179,723 కేసులు నమోదు కాగా, ఇవి గతేడాది మే నెలలో నమోదు చేసుకున్న గరిష్టస్థాయిని అందుకోవడం గమనార్హం. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగాన్ని అందుకుని తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రోజువారీ కేసుల సంఖ్య ఎప్పడులేని విధంగా లక్షల్లో నమోదు అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య 723,619కి పెరిగింది, ఇది దాదాపు 204 రోజులలో అత్యధికం, మరణాల సంఖ్య 146 మరణాలతో 4,83,936కి పెరిగింది. ఓమిక్రాన్ వేరియంట్ యొక్క మొత్తం 4,033 కేసులలో, 1,552 కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,216 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా, రాజస్థాన్ 529, ఢిల్లీ 513, కర్ణాటక 441, కేరళ 333, గుజరాత్ 236 కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles