SC Asks To Preserve PM Modi's Travel Records ప్రధాని పంజాబ్ ట్రావెల్ రికార్డులను భద్రపర్చాలని ‘సుప్రీం’ అదేశం

Pm security lapse supreme court asks for travel records to be preserved

modi punjab rally, modi ferozepur, modi, pm modi, assembly elections 2022, assembly elections latest news, assembly elections covid19 guidelines, Punjab assembly elections, Punjab elections, BJP, PM Modi, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, election commission, election press conference, election 2022, state assembly election 2022, assembly election 2022 dates, punjab election 2022, punjab assembly election 2022 dates, punjab election 2022 schedule, punjab state assembly election 2022 dates, punjab assembly election 2022 schedule, election 2022 news

On a massive security breach that left Prime Minister Narendra Modi stuck on a highway in Punjab for 20 minutes on Wednesday, the Supreme Court today directed the Punjab and Haryana High Court's Registrar General to "keep all records in his safe custody" and the Punjab Police, the Special Protection Group (SPG) and other Centre and state agencies are to "cooperate and provide necessary assistance" to him, the Supreme Court said.

ప్రధానికి భద్రతా వైఫల్యం: ట్రావెల్ రికార్డులను భద్రపర్చాలని ‘సుప్రీం’ అదేశం

Posted: 01/07/2022 03:02 PM IST
Pm security lapse supreme court asks for travel records to be preserved

పంజాబ్ లో ప్ర‌ధాని మోదీ కాన్వాయ్ కు భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఏర్ప‌డిన అంశంపై ఇవాళ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున సీనియ‌ర్ లాయ‌ర్ మ‌ణింద‌ర్ సింగ్ కోర్టులో వాదించారు. ప్ర‌ధాని భ‌ద్ర‌తా వైఫ‌ల్యం కేవ‌లం శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కాదు అని, అది స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్స్ చ‌ట్టం కింద‌కు వ‌స్తుంద‌న్నారు. ఎస్పీజీ చ‌ట్టం ప్ర‌కారం ఇది రాష్ట్ర ప‌రిధిలో అంశం కాద‌ని మ‌ణింద‌ర్ తెలిపారు. ప్ర‌ధాని భ‌ద్ర‌తా అంశం జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన‌ద‌ని, ఇది పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని, ఈ అంశాన్ని ప్రొఫెష‌న‌ల్‌గా ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అడ్వ‌కేట్ మ‌ణింద‌ర్ కోర్టుకు చెప్పారు.

ప్ర‌ధానికి భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోవ‌డం అత్యంత అరుదైన అంశ‌మ‌ని, ఇది అంత‌ర్జాతీయంగా దేశ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చింద‌ని, ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు పెనుముప్పు ఉన్న‌ట్లు తేలింద‌ని కేంద్రం త‌న వాద‌న వినిపించింది. కేంద్రం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదించారు. పంజాబ్ హోంమంత్రిని కూడా ఈ అంశంలో విచారించాల‌ని, ద‌ర్యాప్తు ప్యానెల్‌లో ఆయ‌న స‌భ్యుడిగా ఉండ‌లేర‌ని కోర్టుకు కేంద్రం తెలిపింది. ప్ర‌ధాని భ‌ద్ర‌తా వైఫ‌లం అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవ‌డం లేద‌ని, ద‌ర్యాప్తు కోసం క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని, కేంద్రం కూడా ఓ క‌మిటీని ఏర్పాటు చేసింద‌ని, విచార‌ణ కోసం ఎవ‌రినైనా నియ‌మించ‌వ‌చ్చు అని కోర్టులో పంజాబ్ ప్ర‌భుత్వం త‌న వాద‌న‌లు వినిపించింది.

ప్ర‌ధాని కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుంటే, ఆ రాష్ట్ర డీజీపీని సంప్ర‌దిస్తార‌ని, డీజీపీ అనుమతికి అంగీకరిస్తేనే ఆ మార్గాన ప్రధాని కాన్వాయ్ క‌దులుతుంద‌ని తుషార్ మెహతా కోర్టుకు తెలిప్పారు. అయితే రోడ్డు పై ఆందోళ‌న‌కారులు అడ్డుకుంటార‌న్న హెచ్చ‌రిక‌లను ఇంచార్జ్ డీజీ చేయ‌లేద‌ని ఆయ‌న కోర్టుకు చెప్పారు. పీఎం కాన్వాయ్ కు ముందు వార్నింగ్ కారు వెళ్తుంద‌ని, ఆ స‌మ‌యంలో స్థానిక పోలీసులు ఆందోళ‌న‌కారుల‌తో టీ తాగుతున్నార‌ని, అయితే వాళ్లు ధ‌ర్నా గురించి ఎటువంటి హెచ్చ‌రిక‌లు చేయ‌లేద‌న్నారు. ప్ర‌ధాని పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు చెందిన ట్రావెల్ రికార్డును సేక‌రించాల‌ని పంజాబ్‌-హ‌ర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

క‌మిటీ అయినా లేక క‌మిష‌న్ అయినా.. ప్ర‌ధానికి జ‌రిగిన భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఏంటో నిర్ధార‌ణ జ‌ర‌గాల‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. పీఎం ట్రావెల్‌ రికార్డుల‌ను భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని అన్నారు. విచార‌ణ కోసం పంజాబ్ ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను ఏర్పాటు చేస్తే, మ‌రి కేంద్రం ఏర్పాటు చేసే క‌మిష‌న్ మాట ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌మిటీ అయినా క‌మీష‌న్ అయినా.. స‌మ‌స్య‌ను తేల్చాల‌ని సీజే అన్నారు. ఎస్పీజీ ఐజీ నేతృత్వంలోని క‌మిటీ కేవ‌లం అడ్మినిస్ట్రేటివ్ అంశాల‌ను మాత్ర‌మే ద‌ర్యాప్తు చేస్తుంద‌ని ఎస్‌జీ మెహ‌తా తెలిపారు. ప్ర‌ధాని భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై విచార‌ణ‌కు ఏర్పాటు చేసే క‌మిటీలో ఎన్ఐఏ అధికారితో పాటు చండీఘ‌డ్ డీజీపీ ఉండ‌వ‌చ్చు అని సీజే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles