Darshanam for Devotees who abide rules: Srisailam Temple EO లోక్ సభ సభ్యత్వానికి త్వరలో రాజీనామ చేస్తా: రఘురామ కృష్ణరాజు

Darshanam for devotees who abide by rules says srisailam temple eo

Kanumuru Raghurama Krishnam Raju, MP Raghurama Krishnam Raju, YSR Congress MP, YSRCP MP, Narasapuram MP, RRR Resignation, Resign to MP Post, Disqualification, Sankranti, West Godavari, YS Jagan Rule, disgusted with govt, Andha Pradesh, Politics

Rebel YSR Congress MP from Narasapuram Lok Sabha constituency in West Godavari district Kanumuru Raghurama Krishnam Raju has announced that he is resigning from his Lok Sabha membership, probably after Sankranti festival. “I will resign from my MP seat shortly. The YSR Congress party leaderships has been desperately trying to get me disqualified from Lok Sabha. I am giving them a week’s time. Let them decide on what to do,” he said.

లోక్ సభ సభ్యత్వానికి త్వరలో రాజీనామ చేస్తా: రఘురామ కృష్ణరాజు

Posted: 01/07/2022 01:36 PM IST
Darshanam for devotees who abide by rules says srisailam temple eo

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు స్థానానికి ఇటీవల వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వున్న వైరుద్యాల నేపథ్యంలో పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై కూడా నిత్యం విమర్శలు, అరోపణలు చేస్తునే ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య నుంచి మద్యనిషేదం వరకు అన్ని సమస్యలపై అవగాహన కలిగిన ఆయన తాజాగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో.. తాను రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నానే తప్ప మరోటి కాదని పలు సందర్భాల్లో అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా పదేళ్ల పాటు చరిత్రలో నిలిచే ఆంధ్రప్రదేశ్.. కనీసం భావితరాల భవిష్యత్తుకు చక్కని భరోసా కల్పించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో తనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకుగాను తాను వైసీపీ ప్రభుత్వానికి వారం రోజుల వ్యవధి కల్పిస్తున్నానని చెప్పారు. సంక్రాంతి పండగ పర్వదినం లోపు తనపై అనర్హుడిగా ప్రకటించాలని లేదా తానే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

రాజీనామా చేసిన తరువాత మళ్లీ ఎన్నికలకు వెళ్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలనపై.. సీఎం వైఎస్ జగన్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. అధికార వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తన లోక్ సభ ఉపఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. ఆ పార్టీ నుంచి తొలగించాలని చూసినప్పటికీ సాధ్యంకాలేదన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం వదిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలన్నారు. కాగా, ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుకోనున్నారనే వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles