New Variant 'IHU' Have 46 Mutations ప్రాన్సులో భయటపడిన డేంజరస్ కరోనా ఐ.హెచ్.యు వేరియంట్..

France detects new covid 19 variant ihu more infectious than omicron

IHU, France, New Covid-19 Variant in France, new covid variant, IHU Covid Variant, IHU Covid Variant France, France COVID-19 cases, covid 19 IHU variant symptoms, delta variant, covid 19, omicron symptoms, omicron virus symptoms, omicron variant symptoms and severity, omicron variant symptoms in india, omicron variant symptoms in adults, omicron variant in india, omicron covid cases, latest news on omicron variant, covid 19 new variant omicron symptoms, new covid variant

As the world grapples with the highly mutated Omicron variant of SARS-CoV-2, scientists have identified a new strain of the COVID-19 causing virus in Southern France. Known as 'IHU', the B.1.640.2 variant has been reported by researchers at institute IHU Mediterranee Infection in at least 12 cases, and has been linked to travel to African country Cameroon.

ప్రాన్సులో భయటపడిన డేంజరస్ కరోనా ఐ.హెచ్.యు వేరియంట్..

Posted: 01/04/2022 06:27 PM IST
France detects new covid 19 variant ihu more infectious than omicron

క‌రోనా మహమ్మారి ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. ఇప్పటికే పలు దేశాలలో మూడు, నాలుగు దశలు కూడా ఎదుర్కోన్నాయి. అయినా ఇప్పటికీ ఇంకా ప్ర‌పంచాన్ని తన వేరియంట్లతో కోవిడ్ అత‌లాకుత‌లం చేస్తోంది. దశకు దశకు మధ్య రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. ఇప్పటికే ఒమిక్రాన్ తో అందరినీ ఆందోళనకు గురిచేస్తుండగా, తాజాగా ఫ్రాన్సులో వెలుగుచూసిన వేరియంట్ ఒమిక్రాన్ ను మించిన మ్యూటేషన్లతో ప్రపంచం మొత్తాన్ని కొద్దిపాటి కాలంలోనే చుట్టేసేలా ఉండటం గమనార్హం. ఇది అత్యంత డేంజరస్ వేరియంట్ అని దీనికి ఏకంగా 46 మ్యూటేషన్లు ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. యూర‌ప్ దేశ‌మైన ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోదైన‌ప్ప‌టికీ.. వారంతా ఆఫ్రికన్ దేశ‌మైన‌ కామెరూన్ నుంచి రావ‌డం ఇప్పుడు క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది.

ద‌క్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వేరియంట్ కు చెందిన 12 కేసులు రికార్డ‌య్యాయి. వీటిని B.1.640.2 కేసులుగా గుర్తించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఐహెచ్‌యూ మెడిటెర్ర‌నీ ఇన్‌ఫెక్ష‌న్ గుర్తించింది. ఈ వేరియంట్‌కు ప్ర‌స్తుతానికి ఇనిస్టిట్యూట్ పేరునే ఖారారు చేసి ఐహెచ్‌యూ అని నామ‌క‌ర‌ణం చేశారు. కొత్త వేరియంట్ బాధితుల ట్రావెల్ హిస్ట‌రీని ప‌రిశీలించ‌గా ఆఫ్రిక‌న్ దేశ‌మైన కామెరూన్ వెళ్లొచ్చిన‌ట్లు తెలిసింది. అయితే ఐహెచ్యూ అధ్యయనంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లో వున్న 30 మ్యూటేషన్ల కన్నా అధికంగా 46 మ్యుటేషన్లతో కూడుకుని వుందని తేలింది.

ఒమిక్రాన్ వేరియంట్లో 30కి పైగా మ్యుటేష‌న్లు ఉంటేనే ప్రపంచాన్ని ఒణికిస్తుండ‌గా.. ఈ కొత్త వేరియంట్లో 46 ఉత్ప‌రివ‌ర్త‌నాలు వల్ల మరింత వేగంగా ఇది ప్రపంచాన్ని చుట్టేస్తుందని వైద్యనిపుణులు ఆందోళ‌న చేందుతున్నారు. అయితే, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగాల్సిన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా లేదని ప్రైమరీ డేటా పేర్కొంది. ఇదిలావుండగా, ఈ కొత్త వేరియంట్ ఫ్రెంచ్ సరిహద్దుల నుంచి బ్రిటన్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన కరోనా అన్ని వేరియంట్ల B.1.640.2 భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ వేరియంట్లో అసాధారణ కలయికలను గమనించామని వారు తెలిపారు. కొత్త వేరియంట్‌ అనేక జన్యు మార్పులను చూపుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఫ్రాన్స్ మిన‌హా వేరే దేశంలో ఈ వేరియంట్‌ను ఇంకా గుర్తించ‌లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త వేరియంట్‌పై ఇప్పటివరకు ఎటువంటి పరిశోధన ప్రారంభించలేదు. కానీ ఈ వేరియంట్ గురించి అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగ‌ల్ డింగ్.. ఇది గత వేరియంట్ల కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇది కూడా వేరియంట్ ఆఫ్ క‌న్స‌ర్న్‌గా చెప్పొకొచ్చిన ఆయన.. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని ఏమారుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles