భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఓ కుటుంబం సామూహిక ఆత్యహత్యకు సంబంధించిన ఘటనతో మాజీ ఎమ్మెల్యే తనయుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడటంతో ఆయన పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటనకు తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. తన పేరున కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పరారీలో వున్న ఆయన ఈ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పుకోచ్చారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని రాఘవేందర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం లేకపోయినా తన పేరు ఎందుకు రాశారో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రాజకీయ కుటుంబం అని, పనుల కోసం వందలమంది వస్తారని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చనిపోతే నాకేంటి సంబంధం? అని రాఘవేందర్ ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.
అయితే ఇక్కడి వరకు బాగానే వున్నా.. రాఘవేందర్ తాను రామకృష్ణతో ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం నేరమా? అని ప్రశ్నించడంతో తనకు రామకృష్ణకు మధ్య ఏదో వివాదం నెలకొందన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతటితో అగని అనుమానాలు.. రామకృష్ణ అర్థిక పరిస్థితులు బాగోలేవని రాఘవేందర్ కు ఎలా తెలుసునన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాగా ఈ కేసులో తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని రాఘవేందర్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారం చేశారని అన్నారు. తనను అభాసుపాలు చేసేందుకు రామకృష్ణను ప్రలోభపెట్టారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో కుమార్తె సాహితి కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. కాగా, రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీమ్ కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో రామకృష్ణ రాసిన ఆత్మహత్య లేఖ అధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తొలుత ఈ ఘటన గ్యాస్ లీకేజి ప్రమాదం సంభవించి చోటుచేసుకుందని అనుమానించిన పోలీసులు.. తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more