హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం వేకువ జామూన ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి థియేటర్లో శ్యామ్ సింగరాయ్ సినిమా సెకండ్ షో ముగిసిన తరువాత కొన్ని గంటల వ్యవధిలో ఈ ఘటన జరగడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అధికారులు, థీయేటర్ యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకుంది. అయితే భారీ అగ్ని ప్రమాదంలో థీయేటర్ లోని ఫర్నీచర్ సహా వెండి తెర, సౌండ్ సిస్టమ్ అంతా బూడిదగా మారిందని, థియేటర్ పైకప్పు కూడా కూలిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తొలుత మంటలను గమనించిన సెక్యూరిటీ గార్డు అగ్నిమాపక శాఖను సంప్రదించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. హుటాహుటిన థియేటర్ కు చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేసాయి. మెయిన్ స్విచ్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదానికి, ఆస్తినష్టానికి ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఎప్పుడు, ఎక్కడ మొదలయ్యాయి, ఏ సమయంలో సమాచారం అందించారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
"దగ్గరలో అగ్నిమాపక సిబ్బంది ఉన్నప్పటికీ, భారీ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది?" అన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. డిసెంబర్‌లో వరంగల్‌లోని అఖండ సినిమా ఆడుతున్న జెమినీ థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తుండగా, కొద్దిసేపటికే థియేటర్ అంతా పొగతో నిండిపోయింది. భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more