India's Omicron tally crosses 1500 mark దేశవ్యాప్తంగా కరోనా సామాజిక వ్యాప్తి..? పెరుగుతున్న కేసులు..

Omicron scare maharashtra delhi and kolkata have reported a sharp increase covid cases

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

A total of 1,525 cases of Omicron variant of coronavirus have been detected across 23 states and Union territories so far. Maharashtra recorded the maximum number of 460 cases, followed by Delhi at 351, Gujarat 136, Tamil Nadu 117, and Kerala 109.

దేశవ్యాప్తంగా కరోనా సామాజిక వ్యాప్తి..? పెరుగుతున్న కేసులు..

Posted: 01/03/2022 12:04 PM IST
Omicron scare maharashtra delhi and kolkata have reported a sharp increase covid cases

దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవదశ ముపుతో విరుచుకుపడుతోంది. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని కూడా ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. వారి అంచనాలకు అనుగూణంగానే వారం రోజుల వ్యవధిలో కరోనా కేసులు ఐదు రెట్లు పెరగడం అందోళన కలిగిస్తోంది. గత సోమవారం 6358 కరోనా కేసులు రాగా, ఈ సోమవారం ఆ సంఖ్య ఏకంగా 33 వేలకు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఇదే ఈ భారీ సంఖ్యలో పెరుగుతున్న కేసులే నిదర్శనం.

ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోల్చితే దాదాపు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులకు మాత్రమే సోకిన ఈ కొత్త మహమ్మారి తాజాగా ఎలాంటి వీదేశీయానం లేనివారికి కూడా సోకింది. నిపుణలు చెప్పినట్లు ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా  కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ అంక్షల వైపు మొగ్గు చూపుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య ఏకంగా 1700లకు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 175 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ లలోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఢిల్లీలో లెవల్ 2 దశ ఆంక్షలు అమలు చేస్తూ.. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టారు. అయినా కేసులు మాత్రం పెరుగుతూనే వున్నాయి. ఇటు మ‌హారాష్ట్ర‌ను ఒమిక్రాన్ వేరియంట్ అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. నిన్న‌టి వ‌ర‌కు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 510 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఢిల్లీలో 361 పాజటివ్‌ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 156, గుజరాత్‌లో 136, తమిళనాడులో 121, రాజస్తాన్లో 120, తెలంగాణలో 67, కర్నాటకలో 64, హర్యానా 63, ఒడిశా 37, పశ్చిమ బెంగాల్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 17 కేసులు నమోదు కాగా.. మరో 11 రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles