Coronavirus vaccinations for those between 15-18 years of age will begin from today. Union Health Minister Mansukh Mandaviya also urged the family members of all children between 15 to 18 years of age to register for COVID-19 vaccination in a recent tweet. Those with the birth year 2007 or before will be eligible for vaccination under this category.

Vaccination starts for younger population in 15 18 age group

COVID-19 vaccinations, COVID-19 vaccinations for children, COVID-19 vaccinations for 15-18 year olds, COVID-19 vaccinations for children, COVID-19 vaccination registrations for 15-18 year olds, COVID-19 vaccination registrations for children in delhi, COVID-19 vaccinations for 15-18 year olds in delhi, COVID-19 vaccinations for children in haryana, COVID-19 vaccinations for 15-18 year olds in haryana, COVID-19 vaccinations for children in karnataka, COVID-19 vaccinations for 15-18 year olds in karnataka, COVID-19 vaccinations for children news, COVID-19 vaccinations for 15-18 year olds news

Coronavirus vaccinations for those between 15-18 years of age will begin from today. Union Health Minister Mansukh Mandaviya also urged the family members of all children between 15 to 18 years of age to register for COVID-19 vaccination in a recent tweet. Those with the birth year 2007 or before will be eligible for vaccination under this category.

టీనేజర్లకు ఇవాళ్టి నుంచే వాక్సీన్.. బాధ్యత తల్లిదండ్రులదేనన్న హరీశ్ రావు

Posted: 01/03/2022 01:46 PM IST
Vaccination starts for younger population in 15 18 age group

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజ్ బాలబాలికలకు ఇవాళ్టి నుంచి కరోనాటీకాలు పంపిణీ చేయనున్నారు. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందడంతో పాటు ప్రతీ ఒక్కరినీ ఇది పలకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి టీనేజ్ బాలబాలికలకు వాక్సీన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్దలకు ఇస్తున్నట్టుగానే వీరికి కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకా వేస్తారు. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఇక తమ రాష్ట్రంలో టీకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ  ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఈమేరకు మార్గదర్శకాలు విడుదల చేశామని చెప్పుకోచ్చిన ఆయన.. తమ చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి అక్కడ టీకాలు తీయంచడం ఇష్టంలేని వారికోసం ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అయితే ప్రైవేటు అసుపత్రులలో వాక్సీన్ టీకాలు తీసుకునేవారికి ధరలు ఎలా వుంటాయన్న విషయాన్ని వెల్లడించలేదు. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినట్లుగానే ధరలు వుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి, 12 మునిసిపల్ కార్పొరేషన్లలో ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే టీకాలు ఇవ్వనుండగా, జిల్లాల్లో మాత్రం నేరుగా టీకా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 22,78,683 మంది టీనేజర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. వైద్యుడి పర్యవేక్షణలోనే టీకా వేయనుండగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే ఉండాలి. ఈ క్రమంలో ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తితే కనుక వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే టీనేజర్లు వాక్సీన్ తీసుకునే బాధ్యతను వారి తల్లిదండ్రులపైనే వేశారు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఇక ఈ దిశగా టీనేజర్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత మాత్రం వారి ఉపాధ్యాయులపై వేశారు. కాగా, ఈ నెల 10 నుంచి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మూడో డోసు ఇవ్వనున్నారు.

వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముందంజ‌లో ఉంద‌ని హ‌రీశ్ రావు చెప్పారు. అర్హులైన పిల్ల‌లు అంద‌రూ వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్స‌హించాల‌ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు కూడా సూచ‌న‌లు చేశామ‌ని చెప్పారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ పిల్ల‌ల‌కు టీకాలు ఇచ్చేందుకు అనుమ‌తులు ఇచ్చామ‌ని తెలిపారు. త‌ల్లిదండ్రులంతా విధిగా త‌మ పిల్ల‌ల‌ను వ్యాక్సిన్ కేంద్రాల‌కు తీసుకొచ్చి టీకాలు వేయించాల‌ని ఆయ‌న కోరారు.

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దేన‌ని హ‌రీశ్ రావు చెప్పారు. వ్యాక్సిన్లు వేయించుకోని విద్యార్థులు అనేవారే లేకుండా అర్హులైన పిల్ల‌లంద‌రికీ వ్యాక్సిన్లు అందేలా టీచ‌ర్లు, లెక్చ‌రర్లూ ప్రోత్స‌హించాల‌ని చెప్పారు. పిల్ల‌ల‌కు వారి త‌ల్లిదండ్రులు లేదా టీచ‌ర్ల స‌మ‌క్షంలో వ్యాక్సిన్లు వేస్తున్న‌ట్లు చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారు సెకండ్ డోసు వ్యాక్సిన్ కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 60 ఏళ్లు పైబ‌డి అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న వారు, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు అందరికీ బూస్ట‌ర్ డోసు కూడా ఇవ్వ‌నున్నామ‌ని ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఈ నెల 10 నుంచి బూస్ట‌ర్ డోసు ఇస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles