Actor Charged After Allegedly Attacking Passenger On Flight తోటి విమాన ప్రయాణికుడిపై చేయిచేసుకున్న నటి..

Former baywatch actor charged after allegedly attacking passenger on delta flight

Rosa Parks, Patricia Cornwall, former "Baywatch” actor, NFL cheerleader, federal assault, Atlanta Police Department, Los Angeles, flight attendant, NFL cheerleader, Delta, Baywatch, Hartsfield Jackson International Airport, Atlanta, viral video, trending video, crime

A former "Baywatch” actor and NFL cheerleader is facing federal assault charges after allegedly beating another passenger during a Delta flight who called her a "Karen" after she compared herself to Rosa Parks. Patricia Cornwall, 51, of Los Angeles, was arrested at Hartsfield Jackson International Airport in Atlanta two days before Christmas following the chaotic flight from Tampa, Florida, the Atlanta Police Department stated

ITEMVIDEOS: తోటి విమాన ప్రయాణికుడి చేయిచేసుకుని.. ముఖంపై ఉమ్మిన నటి..

Posted: 12/31/2021 04:02 PM IST
Former baywatch actor charged after allegedly attacking passenger on delta flight

తోటి విమాన ప్ర‌యాణికుడి ప‌ట్ల అనుచితంగా వ్యవహరించిన మాజీ బే-వాచ్ నటిని అరెస్టు చేసిన న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో అమె అగ్రరాజ్యంలోని న్యాయస్థానంలో నిందితురాలిగా నిలబడాల్సి వచ్చింది. అహంభావంతో వ్యవహరించి కోర్టు మెట్లు ఎక్కిన నటి.. న్యాయస్థానంలోనూ కనీసం క్షమాపణ కోరడమో లేక క్షణికావేశంలో జరిగిన ఘటనను పెద్దదిగా చూడరాదని ప్రాధేయపడింది లేదు. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎల్ చీర్ లీడర్ గా వ్యవహరిస్తున్న ఈ నటి గోటితో పోయే గోడవను గొడ్డలి వరకు తెచ్చుకుంటోంది.

తనను తాను రోసా పార్క్స్ కార్యకర్తగా చెప్పుకున్న నటిని.. తోటి ప్రయాణికుడు నువ్వు నల్ల వర్ణ మహిళవు కాదు.. అందునా ఇది అలాబమా కాదు..? పైపెచ్చు ఇది బస్సు కాదు అని అన్నడంతో రెచ్చిపోయిన నటి అతడితో వాగ్వాదానికి దిగి చెంప చెల్లుమనిపించడంతో పాటు ముఖంపై ఉమ్మివేసి అనుచితంగా వ్యవహరించింది. దీంతో లాస్ ఏంజిల్స్ కు చెందిన బే-వాచ్ మాజీ నటి పాట్రిసియా కార్న్‌వాల్ ను ప్లోరిడాలోని టెంపా విమానాశ్రయంలో అట్లాంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 23న జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టంపా నుంచి అట్లాంటాకు వెళ్తున్న‌ డెల్టా విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవడంతో.. కొందరు విమాన ప్రయాణికులు ఆదృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.కాగా, వీటిని ఏటీఎల్ అన్ సెన్సార్డ్ అనే ఛానెల్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. అంతేకాదు. ఈ వీడియో అధారంగా నటి విచారణను కూడా ఎదుర్కోనుంది. నటి పాట్రిసియా కార్న్‌వాల్‌(51) బాత్రూమ్‌కు వెళ్లి.. త‌న సీటు వ‌ద్ద‌కు తిరిగి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బేవ‌రేజెస్ కార్ట్ కూడా రావ‌డంతో.. కొద్దిపేపు ఇతర సీటులో కూర్చోవాలని కార్న్‌వాల్‌ను సిబ్బంది రెక్వెస్ట్ చేశాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. నేను ఎవరు? రోసా పార్క్స్‌? అని చెప్పారు. (ఆఫ్రిక‌న్ – అమెరిక‌న్ సివిల్ రైట్స్ కార్య‌క‌ర్త‌నే రోసా పార్క్స్‌. 1955లో రోసా పార్క్స్ బ‌స్సులో శ్వేత జాతీయుడికి సీటు ఇచ్చేందుకు నిరాక‌రించింది.)

ఈ క్ర‌మంలో ప‌క్క‌నే ఉన్న ఓ ప్ర‌యాణికుడు స్పందిస్తూ మీరు బ్లాక్ కాదు.. ఇది అల‌బామా కాదు.. అంత కంటే బ‌స్సు కూడా కాదు అని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌లు పెను దుమారం రేపాయి. కార్న్‌వాల్‌కు, ఆ ప్ర‌యాణికుడికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ప్ర‌యాణికుడిపై కార్న్‌వాల్ దాడి చేసి చెంప ఛెల్లుమ‌నిపించింది. అంతే కాదు అత‌ని ముఖంపై ఉమ్మేసింది. మాస్కు ధ‌రించాల‌ని ఆమె అత‌న్ని హెచ్చ‌రించింది. ప్ర‌యాణికుడి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కార్న్‌వాల్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles