woman quarantined in flight toilet after testing covid positive విమాన ప్రయాణంలో కరోనా నిర్థారణ.. టాయ్ లెట్లో ఐసోటేల్..

Woman tests covid positive mid air isolates in plane toilet for hours report

Passenger covid positive, Mid flight Covid, Chicago Iceland flight, Marisa Fotieo, Rapid Covid test, Covid Positive On Plane, Covid Positive On Flight, US Covid Cases, COVID-19 US

A US woman was quarantined in an aeroplane bathroom for three hours after testing positive for COVID-19 halfway through a flight from Chicago to Iceland. Marisa Fotieo, a teacher from Michigan, said her throat began to hurt halfway through the trip on December 19 so she went to the bathroom to perform a rapid Covid test which confirmed she was infected.

విమాన ప్రయాణంలో కరోనా నిర్థారణ.. టాయ్ లెట్లో ఐసోటేల్..

Posted: 12/31/2021 04:59 PM IST
Woman tests covid positive mid air isolates in plane toilet for hours report

విమానం గగనయానంలో ఉండగా, అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తన గురించి బాధపడని ఆ మహిళ విమానంలోని ప్రయాణికులకు ఇది సోకితే ఎలా అని చాలా భయాందోళనకు గురైంది. విమానంలోని మిగతా ప్రయాణికులకు తన నుంచి కరోనా సోకకుండా అమె జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందుకోసం అమె ఏకంగా విమానం టాయిలెట్ లో ఏకంగా ఐదు గంటల పాటు ఐసొలేట్‌ అయ్యింది. అమెరికాలో చికాగో నుంచి ఐస్ ల్యాండ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిచిగాన్‌కు చెందిన టీచర్‌ ఫోటీయో, డిసెంబర్‌ 19న తన కుటుంబ సభ్యులతో కలిసి చికాగో నుంచి ఐర్లాండ్‌ వెళ్లే విమానంలో ప్రయాణించారు.

విమానం ఆకాశంలో ఉండగా గొంతులో మంటతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీంతో విమానంలోని బాత్‌రూమ్‌కు వెళ్లారు. తన వద్ద ఉన్న కిట్‌తో కరోనా టెస్ట్‌ చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె చాలా ఆందోళన చెందారు. భయంతో అక్కడే ఏడ్చారు. గమనించిన ఫ్లైట్‌ అటెండెంట్‌ రాకీ, వెంటనే ఫోటీయో వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకుని ఆమెను సముదాయించారు. ఆ మహిళ సీటును మార్చేందుకు ఫ్లైట్‌ అటెండెంట్‌ ప్రయత్నించారు. అయితే విమానంలో ప్రయాణికులు నిండుగా ఉండటంతో సీట్లు ఖాళీగా లేవు. ఫ్లైట్‌ అటెండెంట్‌ రాకీ ఈ విషయాన్ని ఫోటీయోకు చెప్పారు.

మిగతా ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని టాయిలెట్‌లోనే ఆమె ఐసొలేట్‌ అయ్యారు. దీంతో ఆ టాయిలెట్‌ పని చేయడం లేదంటూ నోటీస్‌ ఉంచారు. మిగతా ప్రయాణమంతా ఆమె ఆ టాయిలెట్‌లోనే ఉన్నారు. ఐర్లాండ్‌లో విమానం ల్యాండ్‌ కాగా ఫోటియో, ఆమె తండ్రి, సోదరుడు చివరగా దిగారు. తండ్రి, సోదరుడికి కరోనా టెస్ట్‌లో నెగిటివ్‌ రావడంతో కనెక్ట్‌ విమానంలో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఫోటియోకు విమానాశ్రయంలో మరోసారి రాపిడ్‌తోపాటు ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్ష నిర్వహించగా రెండింటిలో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో హోటల్‌కు తరలించి పది రోజులు క్వారంటైన్‌లో ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Covid Positive On Plane  Covid Positive On Flight  US Covid Cases  COVID-19 US  

Other Articles