YSRC, TDP reek of dynastic politics: Prakash Javadekar బెయిలుపై ఉన్న నేతలు మళ్లీ జైలుకే: ప్రకాశ్ జావదేకర్

Leaders on bail in andhra pradesh will go to jail again predicts javadekar

Prakash Javadekar, Prajagraha Sabha, BJP, YSRCP, TDP, TRS, Massive corruption, dynasty politics, leaders on Bail, CM Jagan, Visakha MP, Vijay Sai Reddy, leaders into Jail, Telangana, Vijayawada, Andhra Pradesh, Politics

BJP senior leader and former Union minister Prakash Javadekar said here on Tuesday that a number of leaders in Andhra Pradesh are on bail and they would sure go back to jail. Addressing the Prajagraha Sabha organised by the state unit of the party, the BJP leader said that the three family political parties, TDP, TRS and YSRCP, are indulging in massive corruption in AP and Telangana

బెయిలుపై ఉన్న నేతలు మళ్లీ జైలుకే: మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్

Posted: 12/28/2021 10:07 PM IST
Leaders on bail in andhra pradesh will go to jail again predicts javadekar

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను గత ఏడేళ్లుగా ఏలుతున్నది కుటుంబ పార్టీలేనని.. వీరి హయాంలో కుటుంబాలకు చెందిన వారు అభివృద్ది చెందుతున్నారే తప్ప.. రాష్ట్రాలు మాత్రం అంగుళం కూడా ప్రగతి సాధించడం లేదని బీజేపి సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ అరోపించారు. ఈ మూడూ కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. విజయవాడలో బీజేపి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో టీడీపీ, వైసీపి రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిలుపై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. ఎన్నికలకు మందు ఇచ్చిన హామీలను కాలగర్భంలో కలుపుతూ ప్రభుత్వాలు పాలనను సాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో అంచెలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే  పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్‌ నెరవేర్చలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తూ.. అవి తమవిగా బీరాలు పోతున్నారని విమర్శించారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలు. వాటికి డబ్బు ఇస్తున్నది కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వమని తెలిపారు.

తాను కేంద్రమంత్రిగా కొనసాగిన సందర్భంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించాయని.. అయితే అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. అమరావతి కోసం అటవీ భూములను కూడా బదిలీ చేశామని చెప్పిన ఆయన.. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘర్షణ పడుతున్నాయని అన్నారు. తాను విజయవాడ సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్‌ చూశానన్న ఆయన.. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వేసిన సిట్‌ను ఏపీలో రద్దు చేశారన్నారు. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరమని నోక్కి చెప్పిన ఆయన.. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపి పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని  ప్రకాశ్‌జావడేకర్‌ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles