complaint on corruption of more than Rs 15 lakh: BJP MP అవినీతిపై బీజేపి ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Don t come to me with corruption complaints of less than rs 15 lakh says bjp mp sparks row

Janardan Mishra, corruption, Madhya Pradesh, Rewa, Rewa MP, BJP, Congress, corruption complaints

BJP MP Janardan Mishra on Monday said that he should be approached with complaints of corruption only if the amount involved is more than Rs 15 lakh. Mishra made the remarks in Madhya Pradesh’s Rewa district, while speaking at a seminar on the role of the media in dealing with current challenges. The BJP leader is an MP from the Rewa constituency.

సర్పంచుల అవినీతికి హద్దులు గీత గీసిన బీజేపి ఎంపీ..

Posted: 12/28/2021 09:37 PM IST
Don t come to me with corruption complaints of less than rs 15 lakh says bjp mp sparks row

అక్రమంగా రూపాయిని ఆర్జించినా అది అవినీతే అని పెద్దలు చెప్పిన మాటలకు నూతన బాష్యం చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడు. బీజేపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్య వహిస్తున్న ఈ ఎంపీ ఓ గీటు గీసి.. అంతకుమించి.. ఆ లోపల అని అవినీతికి హద్దులు గీశారు. ఆయన గీసిన గీటురాయి ప్రకారం రూ.15 లక్షలకు మించితేనే అవినీతికి పాల్పడినట్లని.. ఆ లోపు ఎంత తిన్నా అది అవినీతి కిందకు రానేరాదు అని చెప్పేశారు. ఇంతకీ అవనీతి హద్దులు గీసిన లోక్ సభ సభ్యుడు ఎవరేనేగా.? బీజేపి ఎంపీ జనార్థన్‌ మిశ్రా. ఎవరైనా సరే అతన గీతను దాటి అవినీతికి పాల్పడితే తనకు పిర్యాదు చేయాలని సూచించారు.

15లక్షల పైన అవినీతికి పాల్పడినట్లు అరోపణలు వచ్చిన పక్షంలో ఆయా సర్పంచులపై తనకు సంప్రదించాలని ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ లోని రేవాలో జరిగిన ఓ మీడియా కార్యక్రమానికి హాజరైన ఎంపీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచులుపై ప్రజలు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు అతను రూ.15 లక్షల వరకు అవినీతి చేసి ఉంటే తన వద్దకు రావద్దని, రూ.15లక్షలకు పైబడితేనే తన వద్దకు రావాలంటూ పేర్కొనడంతో ఈ కార్యక్రమానికి  హాజరైన వారు కంగుతిన్నారు. సర్పంచ్లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రజలు పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నారని తెలిపారు.

అయితే ఎ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.7లక్షలు ఖర్చు చేసిన సర్పంచులు ఆ డబ్బును వసూళ్లకు అవినీతికి పాల్పడుతున్నారని, అలాగే రానున్న ఎన్నికల ఖర్చుగా మరో ఏడు లక్షలు.. ఇక పెరుగుతున్న ధరలకు మరో లక్ష అంతా కలపి రూ.15 లక్షల వెసలుబాటు కల్పించారు ఈ ఎంపీ. దీంతో ఎంపీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబట్టాయి. మీడియాకు నిర్వహించిన  ‘ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో మీడియా పాత్ర’ అనే సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janardan Mishra  corruption  Madhya Pradesh  Rewa  Rewa MP  BJP  Congress  corruption complaints  

Other Articles