అడవికి రాజు సింహమే అయినా.. పులి, చిరుతలను చూసినా అడవిలోని జంతువులు భయాందోళన చెందుతుంటాయి. ఎందుకంటే అవి క్రూరమృగాలు. అయితే సింహం ఎలుక కథ మనకు తెలుసు. కానీ తాజాగా మీకు బాతు చేతిలో ఓడిన పులి కథను విన్నారా.? ఇంటర్నెట్ యుగంలో తాజాగా జంతువుల మధ్య ఆధిపత్యం, అందుకు కేంద్రబిందువుగా మారిన స్థానబలంపై మీకు ఓ పాఠం చెబుతోంది. బాతు, పులి కథ.. వీటి రెండింటి మధ్య కథేంటి అంటారా.? కథ కాదు పోరాటం. అయితే దాక్కో దాక్కో బాతు.. పులోచ్చి కోరుకుద్ది పీక అన్న పాటకు తగ్గట్టుగా ఉంటుందీ పోరాటం.
వేటాడేది ఒకటి.. పరుగెత్తేది ఇంకోకటి.. దోరికిందా.. ఇది చస్తాది.. దొరక్కపోతే అది చస్తాది.. ఒక జీవికి అకలి వేసిందా... ఉంకో జీవికి అయువు మూడిందే.. అన్నట్లుగానే బాతు పులి మధ్య పోరాటం సాగింది. ఈ రెండింటి మధ్య పోరాటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అనేగా మీ సందేహం. అందుకనే ఇక్కడ స్థానబలం అన్న విషయాన్ని కూడా నొక్కి మరీ చెప్పాం. సాధారణంగా నేలమీద అయితే పులి కొంత ప్రయాసపడైనా బాతుకు వేటాడుతోంది. కానీ నీళ్లలో అయితే అక్కడ బాతే రాజు. అందుకే స్థానబలం అన్న విషయాన్ని ప్రస్తావించాం. ఇక ఇక్కడ ఈ రెండింటి మధ్య పోరాటం ఎలా వుంటుందో తెలుసా..?
అవును.. ఓ కొలనులో బాతు, పులి రెండింటి మధ్య జరిగిన హైడ్ అండ్ సీక్ గేమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి తన దగ్గరికి రాగానే బాతు నీళ్లలో మునగడం.. బాతు నీళ్లలో మునగడం చూసి పులి షాక్ అవడం.. మళ్లీ బాతు నీళ్లలో నుంచి పైకి రావడం.. దాన్ని చూసి పులి దగ్గరికి రాబోయేసరికి మళ్లీ నీళ్లలో మునగడం.. ఇదంతా ఒక ఆటలా అనిపిస్తుంది. చివరకు పులి ఏం చేయలేక నిస్సాయక స్థితిలో ఉండిపోతుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైండ్ అండ్ సీక్ ఆట బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
Playing hide and seek. pic.twitter.com/foCNauJu1N
— Buitengebieden (@buitengebieden_) December 26, 2021
(And get your daily news straight to your inbox)
May 27 | ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్.. అమెను మెల్లిగా ముగ్గులోకి దింపాడు. వద్దు వద్దు అనుకుంటూనే అమె కూడా పైలట్ కు అనుకూలంగా మసలుకుంది.... Read more
May 27 | కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కొత్త చీఫ్ అబు అల్ హసన్ అల్ ఖురేషీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో పోలీసులకు చిక్కాడు. వాయవ్య సిరియాలో టర్కీ ఆధిపత్య తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ఇడ్లిబ్లోని... Read more
May 26 | స్కూలు యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరూ చేసేవాళ్లే కానీ.. ఆ బాలికకు కావాల్సిన అదుకునే హస్తం మాత్రం రాలేదు. కాగా, ఈ... Read more
May 26 | ఈజీ మనీవేటలో సైబర్ నేరగాళ్లు వేసే కొత్త ఎత్తులు.. ఔరా అనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయినా వీళ్లు దొంగలే. దొంగలు రహస్యంగా రెక్కీ నిర్వహించి ఇంటికి కన్నాలు వేయడం, జేజులు... Read more
May 26 | తన కుటుంబం సమాజంలో ఉన్నతంగా ఉండాలని కోరుకునే భార్యభర్తలు ఇద్దరు రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి పనిచేసుకుని బిడ్డలకు చక్కని విద్యను అందిస్తారు. అయితే కొన్న కుటుంబాలలో మాత్రం భార్యలు అనుక్షణం గృహహింసను ఎదుర్కోంటూనే ఉంటారు.... Read more