Vaccines for children aged 15-18 years కాలేజీ ఐడీలతోనే కరోనా వాక్సీన్ రిజిస్ట్రేషన్..

India announces precautionary covid 19 doses for above 60 years

Children covid Vaccination registration,vaccination,cowin,children,covid-19,RS Sharma, india booster doses, why is a booster dose of vaccine required, what precautions should be taken after covid vaccination, precautions after taking covishield vaccine, booster dose in india for covid, booster dose covid vaccine, booster dose price in india, when to take booster dose of covid vaccine, is booster dose available in india

With the Centre's announcement of vaccinations for children aged 15-18 years from January 3rd, 2022, Dr. RS Sharma, CoWIN platform Chief on Monday informed that the children will be able to register on the CoWIN app from January 1.

కాలేజీ ఐడీలతోనే కరోనా వాక్సీన్ రిజిస్ట్రేషన్.. మూడో డోసుపై క్లారిటీ

Posted: 12/27/2021 09:19 PM IST
India announces precautionary covid 19 doses for above 60 years

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నెమ్మదిగా ప్రారంభమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల మూడో తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేయనున్నారు. అలాగే, 60 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న దాదాపు 3 కోట్ల మందికి మూడో డోసు (ప్రికాషనరీ డోసు) ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మూడో డోసుగా ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. తొలి డోసు తీసుకున్న కంపెనీ వ్యాక్సినే వేయించుకోవాలా? లేదంటే, ఈసారి వేరే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? వంటి అనుమానాలు నెలకొన్నాయి.

ఈ అనుమానులకు నిపుణులు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో, ప్రికాషనరీ డోసు కూడా అదే తీసుకోవాలని చెబుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌దే అగ్రభాగం. మొత్తం వ్యాక్సినేషన్‌లో కొవిషీల్డ్ వాటా ఏకంగా 89 శాతం ఉండడం గమనార్హం. 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు కోటి మందికి కొవిషీల్డ్ టీకా వేయాల్సి ఉంటుందని అంచనా. వీరికి జనవరి 10 నుంచి టీకాలు వేయనున్నట్లు ప్రకటించారు.

ఇక, పిల్లలకు మాత్రం కొవాగ్జిన్ టీకాతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’కి కూడా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినప్పటికీ ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియలో అది భాగం కావడం లేదు. అయితే, మిక్సింగ్ డోసులు వేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య పిల్లలు జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్‌, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు విద్యాసంస్థలు జారీ చేసే స్టూడెంట్‌ ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వీరందరికీ కోవాగ్జిన్ టీకాను  జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Children covid Vaccination registration  vaccination  cowin  children  covid-19  RS Sharma  

Other Articles