Telangana inter first year students declared as pass ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులే: ప్రభుత్వం ప్రకటన

After 6 student suicides telangana govt passes students who failed inter exams

Ts Inter First Year result 2021, Ts Inter First Year result, TS inter first year, TS Inter Results 2021, TS Inter 1st Year Results 2021, TS Inter results direct link, TSBIE Inter 1st year results 2021, Telangana State Board of Intermediate Education, Sabitha Indra Reddy, CM KCR, Inter Ist year Students, Telangana government, T-SAT, Hyderabad, Telangana, Politics

The Telangana government on Friday, announced that all students who failed the first year Intermediate examinations will be given minimum marks and shall be declared as pass. The announcement comes days after as many as six students took their own lives after their failed the examination.

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులే: ప్రభుత్వం ప్రకటన

Posted: 12/24/2021 08:34 PM IST
After 6 student suicides telangana govt passes students who failed inter exams

ఇంటర్‌ ఫస్టియర్‌ పలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి.. మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా చేస్తున్నామని ప్రకటించారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆ విపత్కర పరిస్థితులలో తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని తెలిపారు. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సమన్వయం సాధించామన్నారు.

రాష్ట్రంలోని 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశామన్న మంత్రి.. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య చాలా కీలకమని అందుకనే ఇక్కడ కొంత కఠినంగా వ్యవహరించామన్నారు. వీరి విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్న మంత్రి టీ-శాట్‌, దూరదర్శన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.అయినా నెలరోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 49శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని అన్నారు.

ఫస్టియర్‌ ఫలితాలపై విమర్శలు సరికాదన్న మంత్రి.. 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారన్నారు. ఇంటర్‌ బోర్డు తప్పు లేకున్నా నిందించడం సరికాదని అన్నారు. పార్టీలను పక్కనపెట్టి  విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు.. ఇంటర్‌ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్‌ చేస్తున్నాం. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలి. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా పాస్‌ చేస్తారని ఆశించవద్దు’’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles