High Court Chides Juhi Chawla Over 5G Lawsuit సినీనటి జూహీ చావ్లాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..

Delhi hc to hear juhi chawla s appeal against 5g suit dismissal on jan 25

Delhi High Court, Delhi HC on Juhi Chawla, Juhi Chawla on 5G service, India 5G services, India telecom, Delhi HC on 5G services, High court Divisional bench, Justice Vipin Sanghi, Justice Jasmeet Singh, single court judge, Justice Jag Jivan Ram Midha, Delhi, Technology, India

The Delhi High Court deferred the hearing of Juhi Chawla’s appeal against a single-bench order which in June dismissed her suit against the introduction of 5G technology in India. The division bench of Justice Vipin Sanghi and Jasmeet Singh Thursday, at the outset of the hearing, said it will hear the appeal after the upcoming court vacations and listed it for hearing on January 25.

‘‘ఆరు నెలల గడిచాకా వస్తారా.?’’ సినీనటి జూహీ చావ్లాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..

Posted: 12/24/2021 07:32 PM IST
Delhi hc to hear juhi chawla s appeal against 5g suit dismissal on jan 25

బాలీవుడ్‌ నటి జూహీ చావ్లాపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అమె దాఖలు చేసిన పిటీషన్ ను కోట్టివేసిన ఆరు నెలలకు మళ్లీ కోర్టు తీర్పును సవాల్ చేయడంపై న్యాయస్థానం ఈ మేరకు అసహనం వ్యక్తం చేసింది. జూహీ చావ్లా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకగా గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా అమెతో పాటు మరికోందరు 5జీ టెక్నాలజీపై వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జూహీ తాజాగా అప్పీల్‌ దాఖలు చేశారు. అయితే తీర్పుపై ఆరు నెలల ఆలస్యంగా అప్పీల్‌ చేయడంపై జస్టిస్‌ విపిన్‌ సంఘీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, జూహీ అప్పీల్ ను స్వీకరించిన న్యాయస్థాన డివిజన్ బెంచ్.. ప్రస్తుతం పలు పిటిషన్లు లిస్టింగ్ లో ఉన్నాయని.. అందువల్ల జనవరిలో 5జీ టెక్నాలజీపై దాఖలైన అప్పీలుపై విచారణ చేపడతామని వెల్లడించింది. 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా జూహీతో పాటు మరికొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం ప్రచారం కోసం వేసిన పిటిషన్‌ మాత్రమేనని పేర్కొంటూ న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. అంతేగాక, విచారణ సమయంలో జూహీచావ్లా అభిమానులు ఆన్ లైన్ లో జరుగుతున్న కోర్టు ప్రోసీడింగ్స్ లోకి చోరబడి ఆటంకం కలిగించారు.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జూహీతో పాటు మిగతా పిటిషనర్లకు రూ.20లక్షల జరిమానా విధిస్తూ ఈ ఏడాది జూన్‌లో దిల్లీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా జూహీ డివిజన్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా 5జీ టెక్నాలజీపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. 5జీ టెక్నాలజీపై ప్రతి రోజూ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దీని వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు పెనుముప్పు పొంచివుందని అమె అన్నారు.

5జీ సేవలు అందుబాటులోకి తెస్తే మనుషులతో పాటు పశుపక్షాదులకు ముప్పు కలుగుతుంది. ప్రస్తుతమున్న రేడియేషన్‌ ప్రభావం 10 నుంచి 100 రెట్లు పెరుగుతుంది. 5జీ టెక్నాలజీ.. మనుషులకు, మూగజీవాలకు భద్రమైందా.. కాదా.. అన్నది అధికారులు స్పష్టంగా చెప్పేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి’’ అని జూహీ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఇక రేడియో ధార్మిక తరంగాల వల్ల పశుపక్షాదులతో పాటు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయమై అథ్యాయనాలు కూడా లేవని అమె తన అప్పీలులో పేర్కోన్నారు. ఈ దిశగా పరిశోధనలు కూడా జరగాలని అమె న్యాయస్థానాన్ని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles