Nani calls low prices of movie tickets in AP illogical సినిమా టికెట్ ధరలపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..

Tollywood actor nani responds to reduction of movie ticket prices in andhra pradesh

nani, natural star nani, nani on movie ticket pricing, nani shyam singha roy, ap low cap movie tickets, nani movies, nani movies christmas, nani movies new year, nani movies in AP, nani on AP Govt decision, nani on ticket pricing, andhra pradesh news

The government’s decision of pricing cinema tickets at low rates in Andhra Pradesh has impacted the overall box office collections of films like Akhanda. The issue is presently pending in the High Court of Andhra Pradesh. The government of Andhra Pradesh’s stand on the matter and the response by the Telugu film industry bigwigs so far has become the subject of discussion.

సినిమా టికెట్ ధరలపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు.. మంత్రి బోత్స కౌంటర్

Posted: 12/23/2021 07:34 PM IST
Tollywood actor nani responds to reduction of movie ticket prices in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీరును ఇప్పటికే పలువురు హీరోలు ఖండించిన విషయం తెలిసిందే. ఇక కొందరు నిర్మాతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్ల యజమానులు.. ధరలను పెంచి టికెట్లను విక్రయిస్తున్న క్రమంలో దాడులు చేసిన అధికారులు ఏకంగా 50 ధియేటర్లకు పైగా సీజ్ చేసిన విషయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలను వేరుగా చూడాల్సిన అవసరం లేదు.. కానీ హై-బడ్జెట్ చిత్రాలను కూడా తక్కువ ధరలకు ప్రదర్శింపజేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సినీ హీరో నాని బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'శ్యామ్ సింగరాయ్' చిత్రబృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నాడు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని పేర్కొన్నాడు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని చెప్పాడు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని అన్నాడు. అయినా, ఇప్పుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని నాని అభిప్రాయపడ్డాడు. 

కాగా నాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లాల స్థాయిలో అధికారులకు నివేదించాలని, ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స పేర్కొన్నారు. మీకు నచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్మేందుకు అనుతిస్తే ఒత్తిళ్లు లేనట్టా...? ధరలు నియంత్రిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా..? అని నిలదీశారు. సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే సినిమా టికెట్ల ధరలు తగ్గించామని, ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముంది? అని ప్రశ్నించారు. మార్కెట్లో వస్తువులకు ప్రతిదానికి ఎమ్మార్పీ అనేది ఉంటుందని, ఆ పరిమితికి మించి అమ్మకూడదు కదా! అంటూ హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles