23 new Omicron new cases in Maharashtra మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభన.. టీకా తీసుకున్నా ఇవి చేయవద్దు..

Omicron covid india news 23 new omicron new cases in maharashtra

Omicron cases in India, Omicron cases in Delhi, Omicron cases in Maharashtra, Anthony Fauci, corona pandemic, omicron variant, US CDC, America, Maharashtra, crime

Omicron in India News Updates: India has recorded over 300 Omicron cases so far, with Maharshtra reporting 65 cases, followed by Delhi with 64 cases of the new variant of coronavirus. Telangana and Tamil Nadu reported 38 cases and 34 cases respectively, while Karnataka and Kerala confirmed 31 and 29 cases of the new variant.

మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభన.. టీకా తీసుకున్నా ఇవి చేయవద్దు..

Posted: 12/23/2021 06:41 PM IST
Omicron covid india news 23 new omicron new cases in maharashtra

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ ఈ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాలు ఈ వేరియంట్ విజృంభనకు అతలాకుతళం అవుతున్నాయి. అటు అమెరికాలోనూ ఈ వైరస్ తన జడలు విప్పింది. అనేక మంది అగ్రరాజ్యవాసులు కూడా దీని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ఫాసీ సూచించారు. ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనాలనే ఉద్దేశ్యంతో బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఎక్కువ మంది గుంపులుగా చేరే కార్యక్రమాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇలా చేయడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ ప్రమాదం ఉంటుందని స్పష్టంచేశారు. ఇక ఇప్పటికే కోత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తురిస్తుందని, పైగా రోగ నిరోధక శక్తిని కూడా ఏమార్చుతూ ఇది శరీరంలోకి వెళ్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో గుంపులుగా చేరి చేసుకునే వేడుకలకు స్వస్తి పలికి.. కరోనా ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. ప్రాథమిక పరిశోధనల్లో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని తేలిందని ఆయన చెప్పారు. అయితే అమెరికన్లు జాగ్రత్తలు పాటించాలని, లేదంటే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

ఇటు మనదేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ కొత్తరకం మహమ్మారి వేరియంట్.. ఇప్పటికే ఢిల్లీవాసులను అందోళనకు గురిచేయగా, ఇక తాజాగా మహారాష్ట్రలో ఈ కరోనా కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్నది. మహారాష్ట్రలో ఈ కొత్త వేరియంట్ గత 24 గంటల్లో కొత్తగా 23 మందికి వ్యాపించింది. కరోనా డెల్టా కేసులతో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోన్న మహారాష్ట్ర వాసులకు తాజాగా ఒమిక్రాన్ కూడా అందోళనకు గురిచేస్తోంది. ఒక్క పూణేలోనే 13 కేసులను గుర్తించారు. ముంబైలో ఐదు, ఉస్మానాబాద్‌లో రెండు, థానే, నాగ్‌పూర్, మీరా-భయందర్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 88కు చేరింది. ఇందులో 42 మంది ఒమిక్రాన్‌ రోగులకు చికిత్స తర్వాత నెగిటివ్ రిపోర్ట్‌ రావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కొత్తగా 1,179 కరోనా కేసులు, 17 మరణాలు నమోదైనట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,53,345కు, మొత్తం మరణాల సంఖ్య 1,41,392కు చేరినట్లు వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ విజృంభణపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సమీక్షించనున్నారు. గురువారం రాత్రి పది గంటలకు కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌తో వర్చువల్‌గా సమావేశమవుతారని సీఎం కార్యాలయం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles