Blast in Punjab's Ludhiana court, 2 die పంజాబ్ కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి..

Two killed in blast at ludhiana district court complex

Ludhiana Court Blast News, Ludhiana, district court, explosion, fire tender, Ludhiana Explosion, Ludhiana Court Complex Explosion, Ludhiana Court Explosion, Ludhiana Court Blast, Bomb blast, Punjab bomb blast, punjab court bomb blast, Punjab, crime

A bomb went off in the district court complex in Ludhiana, killing one person and injuring five others, prompting the Punjab government to declare a high alert in the state. Police suspect that the man killed in the blast in the second-floor bathroom was trying to set off the explosive device, or may even have been a suicide bomber.

పంజాబ్ లుధియానా కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు..

Posted: 12/23/2021 05:47 PM IST
Two killed in blast at ludhiana district court complex

పంజాబ్ లోని జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించి ఇద్దరు మరణించారు. కాగా ఈ పేలుడు ఘటనలో మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పంజాబ్ లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కోర్టు సముదాయ భవనంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. రెండో అంతస్టులోని బాత్ రూమ్‌లో పేలుడు సంభవించింది.. దాని తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నడంతో పాటు సమీపంలోని అద్దాలు కూడా ఒక్క ఉదుటున పగిలిపోయి దూసుకెళ్లాయని చెప్పారు.

అయితే పేలుడు సంభవించిన సమయంలో లుధియానా జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. బాంబు పేలుడుకు కారణాలపై దర్యాప్తును ప్రారంభించింది. పోలీసులు కోర్టు ఆవ‌ర‌ణ‌లో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసు సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాంబు విస్పోటనం సమాచారం అందడంతోనే వాయువేగంతో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన బాంబు డేటా సెంటర్‌కు చెందిన బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.

ఈ మేరకు పేలుడు ఎలా సంభవించిందో విచారించడానికి చండీగఢ్‌ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) బృందం లూథియానా జిల్లా కోర్టుకు రానున్నట్లు అధికారులు  వెల్లడించారు. ఈ క్రమంలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ పోలీసులను ఈ ఘటన గురించి సత్వరమే విచారణ చేపట్టాలని ట్విట్టర్‌లో కోరారు. అంతేకాదు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు.  ఈ మేరకు చన్నీ మాట్లాడుతూ..."ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పంజాబ్ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles