AP govt cuts vat on liquor, offers popular liquor brands! మందుబాబులకు వైసీపీ సర్కార్ న్యూఇయర్ గిప్ట్.!

Andrha pradesh government cuts vat on liquor rates offers popular liquor brands

AP govt cuts vat on liquor, AP govt cuts additional excise duty on liquor, AP govt U-turn on liquor, popular liquor brands in AP liquor stores, AP Govt New Year Gift, vat on liquor, additional excise duty, AP govt U-turn, popular liquor brands, liquor stores, AP Govt New Year Gift, Andhra Pradesh, politics

Andhra Pradesh government took a U-turn and decided to cut liquor prices and offer all popular liquor brands in AP liquor stores from next week as a New Year Gift. The government reduced VAT and additional excise duty on liquor to bring down prices. With the latest decision, the liquor prices are expected to come down by 10 per cent to 20 per cent.

మందుబాబులకు వైసీపీ సర్కార్ న్యూఇయర్ గిఫ్ట్: మద్యం రేట్లపై వ్యాట్ ధరల తగ్గింపు

Posted: 12/18/2021 06:49 PM IST
Andrha pradesh government cuts vat on liquor rates offers popular liquor brands

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మందుబాబులకు కాసింత ముందుగానే క్రిస్ట్ మస్, న్యూఇయర్ గిప్ట్ అందించింది. అదేంటి మరో కొత్తపథకం తీసుకువచ్చిందా.? అంటే.. అలాంటిదేనని చెప్పాలి. అయితే అందరికీ కాదండీ కేవలం మందుబాబులకు మాత్రమే. అదేంటి అంచెలవారి మద్య నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామన్న ప్రభుత్వం ఆదాయం కోసం అన్వేషణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందా.? లేక మందుబాబులను ప్రసన్నం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందా.? తెలియదు కాని మద్యంబాబులకు మాత్రం తీపి కబురును అందించింది.

వైస్సార్ సర్కారుపై మందుబాబులు తీవ్ర ఆగ్రహంతో వున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం ప్రభుత్వం వారిని కూడా ప్రసన్నం చేసుకునేలా తాజాగా గుడ్‌న్యూస్‌ చెప్పింది. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. వ్యాట్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో మార్పులతో ఏపీలో మద్యంధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గనుండగా మిగిలిన అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు రేట్లు తగ్గనున్నాయి. వచ్చేవారం నుంచి అన్ని వైన్షాపుల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి.

వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ క్రమబద్దీకరించినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles