Florida Man Wears Women's Underwear For Mask on Flight విమానం నుంచి ప్రయాణికుడిని దించేసిన సిబ్బంది..

Florida man booted off flight for wearing women s underwear as a mask

Adam Jenne, Florida man kicked off flight, Florida man mask, florida man woman underwear mask, Fort Lauderdale to Washington

A man was kicked off a flight in the US for wearing women's underwear as a face mask. In footage taken by another passenger and shared widely online, Adam Jenne can be seen wearing a pink thong over his face as he sits in his seat before the flight from Fort Lauderdale to Washington took off.

ITEMVIDEOS: విమానం నుంచి ప్రయాణికుడిని దించేసిన సిబ్బంది.. నిషేధం విధింపు..

Posted: 12/18/2021 05:53 PM IST
Florida man booted off flight for wearing women s underwear as a mask

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్న క్రమంలో మరోమారు ప్రపంచదేశాలన్ని కరోనా నిబంధనలు అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ను నివారించేందుకు మాస్క్, వాక్సీన్ రెండు డోసలు తప్పనిసరి అని వైద్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. అయితే ఈ నిబంధనలను పాటించని ఓ వ్యక్తిని అమెరికాలోని విమానయాన సంస్థలు విమానం నుంచి కిందకు దింపేసాయి. అంతేకాదు అతని విమానయానంపై కూడా నిషేధాన్ని విధించాయి. అయితే అతని ముఖానికి మాస్క్ లాంటి వస్త్రం వుంది. అయినా విమాన యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

ఎందుకిలా ఓ ప్రయాణికుడిపై ఇంతటి కఠిననిర్ణయం తీసుకుందో తెలియదు కానీ.. ఫోర్ట్ లౌడర్ డేల్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న యూనైటెడ్ విమానం అతడ్ని కిందకు దించివేసింది. అయితే విమానయాస సంస్థ అతడు మాస్క్ స్థానంలో మహిళల లోదుస్తులను ముఖానికి తగలించుకున్నాడని, అందుచేతే కోవిడ్ ప్రోటోకాల్ పాటించని కారణంగా విమానం నుంచి ఆ ప్రయాణికుడిని దించివేసామని తెలిపారు. అదేంటి మాస్క్ స్థానంలో మహిళల అండర్ వేర్ ను వినియోగించడమా.. అదేమిటీ అని అలోచిస్తున్నారా.? ఔను ఇదే నిజం. సదరు ప్రయాణికుడు మాస్క్ స్థానంలో అండర్ వేర్ ను ముఖానికి తగిలించుకున్నాడు.

కరోనా వైరస్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతూ.. ప్రపంచ దేశాలను గడగడలాడించిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ స్థానిక సూపర్ మార్కెట్ కు వెళ్లింది. అక్కడి సెక్యూరిటీ గార్డు వెళ్లి అమెను మాస్కు పెట్టుకోవాలని సూచించగా, వెంటనే అప్రమత్తమైన ఆమె తన అండర్ వేర్ తీసి.. దానిని మాస్క్ మారదిగా ముఖానికి ధరించింది. దీంతో ఆక్కిడివారు విస్తుపోయారు. మాస్క్ లేకుండా అమెను సూపర్ మార్కెట్ లోకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విపరీత ఘటన జరగడం ఇది తొలిసారి కాదు.

ఉక్రెయిన్ లోని ఓ మహిళ కూడా అక్కడి పోస్టాపీసుకు వెళ్లింది. కానీ మాస్క్ తప్పనిసరి కాడంతో అమె కూడా ఇదే తరహాలో తన అండర్ వేర్ ను ముఖానికి మాస్క్ లా ధరించింది. ఇలాంటి ఘటనలు చూసి వచ్చిందో లేక స్వయంగా అలా అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ.. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు అతడు నిరాకరించారు. ఎంతగా చెప్పినా అతడు మాట వినకపోవడంతో విమానం నుంచి దించేశారు.

అంతేకాదు, మాస్కు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడిపై నిషేధం విధిస్తున్నట్టు విమానయాన సంస్థ పేర్కొంది. దీనిపై ఆడమ్ జేన్ మాట్లాడుతూ.. విమానంలో తినేటప్పుడు, తాగేటప్పుడు కూడా మాస్కు ధరించాలని చెబుతున్నారని, అందుకు నిరసనగానే తాను ఈ పని చేసినట్టు చెప్పాడు. అంతేకాదు, గతంలోనూ తాను ఇలానే ప్రయాణించానని, అప్పట్లో విమాన సిబ్బంది తనను అడ్డుకోలేదని గుర్తు చేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles