Cold wave hits Hyderabad హైదారబాద్ నగరంపై చలిపులి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ

Hyderabad likely to witness single digit temperatures

imd-h, Yellow alert, Orange alert for 20 and 21, temperature, weather forecast, night temperatures, northern parts of India, cold wave

Serilingampally shivered at 9.7 degree Celsius on Friday, as minimum temperatures continue to dip in Hyderabad. Against a normal minimum temperature at this time of the month of 18 degree Celsius, the city recorded 13 degree Celsius on Friday. The IMD-H has issued a Yellow alert for the city till December 19. An Orange alert has also been issued for December 20 and 21.

హైదారబాద్ నగరంపై చలిపులి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ

Posted: 12/17/2021 09:12 PM IST
Hyderabad likely to witness single digit temperatures

శీతాకాలం కావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో చ‌లిగాలులు వీస్తున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణ స్థాయి కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. సాధార‌ణంగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త 18 డిగ్రీల సెల్సియ‌స్ ఉండాల్సి ఉంది. కానీ శుక్ర‌వారం ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త 13 డిగ్రీల సెల్సియ‌స్‌గా న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాదీల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ హైద‌రాబాద్ విభాగం అధికారులు ఈ నెల 19 వ‌ర‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. ఇంకా ఈ నెల 20, 21 వ‌ర‌కు ఆరంజ్ అల‌ర్ట్ విడుద‌ల చేశారు. మున్ముందు సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత ప‌డిపోతాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం హైద‌రాబాద్ అధికారులు తెలిపారు.

వ‌చ్చే ఐదు రోజుల్లో సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియ‌స్ ప‌డిపోతాయ‌న్నారు. ఇక చ‌లి గాలులు గంట‌కు ఆరు నుంచి 8 కిలోమీట‌ర్ల వేగంతో వీస్తాయ‌ని పేర్కొన్నారు. ప‌లు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు 15 డిగ్రీల సెల్సియ‌స్‌కు ప‌డిపోతాయ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ‌గా న‌మోదు కావ‌డంతో చ‌లిగాలులు వీస్తున్నాయి. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో క‌నిష్ఠంగా ఎనిమిది డిగ్రీల సెల్సియ‌స్ రికార్డైంది. ఆదిలాబాద్‌తోపాటు రాజ‌న్న సిరిసిల్ల, జ‌గిత్యాల్‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో భార‌త వాతావ‌రణ విభాగం హైద‌రాబాద్ అధికారులు ఆరెంజ్ హెచ్చ‌రిక జారీ చేశారు.

భార‌త వాతావ‌ర‌ణ విభాగం క‌ల‌ర్ కోడెడ్ వార్నింగ్స్ ఇలా..

గ్రీన్ (ఆల్ ఈజ్ వెల్‌).. ఎటువంటి అడ్వైజ‌రీల్లేవు.
ఎల్లో ( బీ అవేర్) .. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 11-15 డిగ్రీల సెల్సియ‌స్ ఉన్న‌ప్పుడు.
ఆరెంజ్‌ ( బీ ప్రిపేర్డ్‌) .. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 5-10 డిగ్రీల సెల్సియ‌స్ ఉన్న‌ప్పుడు.
రెడ్ ( టేక్ యాఆక్ష‌న్‌) .. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు నాలుగు డిగ్రీలు.. అంత‌కంటే త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles