woman dragged on road for 200 metres in Delhi యువతిని బైక్ తో ఏకంగా 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి..

Bikers assault woman in delhi s shalimar bagh area drag her for 150 metres

Shalimar bagh Woman dragged, Woman mobile snatched, Shalimar bagh assault, Shalimar bagh Delhi incident, Shalimar bagh viral video, Delhi snatching, Shalimar Bagh snatching, Snatchers drag woman on road, Delhi snatchers, Phone snatchers, Delhi robbery, Delhi crimeviral news, Viral post, viral alerts, viral trending

A 23-year-old woman was injured after two men on a scooter dragged her on the road for nearly 150 metres while trying to snatch her phone at a busy street in northwest Delhi’s Shalimar Bagh on Thursday evening. The incident was captured by the CCTV cameras, and the footage was shared on the social media.

ITEMVIDEOS: అమానుషం: యువతిని బైక్ తో ఏకంగా 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి..

Posted: 12/17/2021 07:23 PM IST
Bikers assault woman in delhi s shalimar bagh area drag her for 150 metres

దేశ రాజధానిలో మహిళల బధ్రతపై మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. నిర్భయ తరహా ఘటనలు జరిగిన తరుణంలో ఢిల్లీలో అడుగడుగునా నిఘా పెంచిన పోలీసులు.. ఆ కేసులో దోషులకు శిక్షపడిన తరువాత ఊపిరిపీల్చుకన్నారు. అయితే ఇప్పటికీ దేశరాజధాని ఢిల్లీలో మహిళలపై పలు నేరాలు. ఘోరాలు జరుగుతూనే వున్నాయి. అయితే వాటికి అంతగా ప్రాముఖ్యత, ప్రచారం లభించడం లేదు. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఓ వీడియో.. మహిళల భద్రతపై మరోమారు ప్రశ్నలను లేవనెత్తింది.

ఢిల్లీ పోలీసులు అటు కేంద్రంలోని పెద్దలకు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తూ ఇటు ప్రజలకు కూడా సేవలు అందించే క్రమంలో సామాన్యుల రక్షణపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేని ఘటన జరిగిన సమయంలో ముందస్తు చర్యలు తీసుకునే పోలీసులు అంశం తెరపైకి వస్తుంది. కానీ ఢిల్లీలో మాత్రం అలాంటి పోలీసు వ్యవస్థ ఉందా.? అన్న ప్రశ్నలకు ఈ వీడియో సమాధానంగా నిలుస్తోంది. ఈ వీడియోలో ఓ 21 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు బైక్ పై పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్నారు. అలాగా తమ వాహనాన్ని మలుపు కూడా తిప్పారు. ఎదురుగా ఓ కారు, ఆ వెంటనే ఓ బైక్ వస్తున్న క్రమంలో అమెను వదిలిపెట్టారు.

అంతే అమె ఒక్కసారిగా అలా వచ్చి నడిరోడ్డుపై అగిపోయింది. బైక్ కు పక్కగా వెళ్లిన కారులోని వ్యక్తి అమెను గమనించి కారు అపాడు. ఆ వెనుకే వస్తున్న మరో బైకర్ కూడా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ యువతికి కారు, బైక్ తో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అమెను ఈడ్చుకోచ్చిన ఆ దుండగులు ఎవరు.? ఎందుకిలాంటి అమానుష చర్యకు పాల్పడ్డారు. తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న అమె.. తన చేతిలోని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తోంది. అంతే అమె వెనకాలే వచ్చిన దుండగులు అమె సెల్ ఫోన్ లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో ఏకంగా 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.

అసలేం  జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్‌ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్‌ని లాక్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles