Saraswati Devi sculpture discovered at Basara బాసరలో మరో పురాతన సరస్వతీ దేవి శిల్పం లభ్యం..

Researchers stumble upon 1000 yr old saraswati devi sculpture at basara

goddess Saraswati, rare old sculpture, Basara, Nirmal, Rashtrakuta, Chalukyas period, black stone, Artha Padmasana posture, Balagam Ram Mohan, PapaHareshwara Temple, Telangana, Devotional

Historians have discovered a rare old sculpture of goddess Saraswati at Basara in Nirmal district. The sculpture probably dates back to Rashtrakuta Chalukyas period. Carved on a black stone, the sculpture depicting Goddess Saraswati in a Artha Padmasana posture. Balagam RamMohan, a member of Kotha Telangana Charitra Brundam (KTCB), discovered the sculpture in PapaHareshwara Temple during his visit.

బాసరలో మరో పురాతన సరస్వతీ దేవి శిల్పం లభ్యం..

Posted: 12/15/2021 04:03 PM IST
Researchers stumble upon 1000 yr old saraswati devi sculpture at basara

నిర్మల్‌ జిల్లాలోని బాసర అనగానే అందరికీ గుర్తుకువచ్చే పేరు సరస్వతీ దేవి దేవాలయం. అలాంటి పుణ్యధామంలో మరో పురాతన సరస్వతి శిల్పం చరిత్రకారులకు లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసరవాసి బలగం రామ్మోహన్ బాసరలోని పాపహరేశ్వర దేవాలయపు గర్భగుడిలో కొత్తదైన పురాతన సరస్వతి శిల్పాన్ని గుర్తించాడు. స్థానికుల నుంచి పార్వతి దేవిగా పూజలు అందుకుంటున్న ఈ సరస్వతీ మాత విగ్రహాన్ని ఆయన గుర్తించారు. దేవతా ప్రతిమ లక్షణాలను పరిశీలించిన ఆయన ఈ విగ్రహం సరస్వతీ అమ్మవారిదిగా గుర్తించారు.

ఈ దేవతా మూర్తి విగ్రహం తలపై కరండమకుటం, చెవులకు చక్రకుండలాలు, మెడలో హారగ్రైవేయకాలు, కేయూరాలు, కంకణాలు, మణిమేఖల, జయమాల ధరించి ఉన్నది. ఈ దేవతామూర్తి చతుర్భుజి పై చేతులలో అంకుశం, పాశం, ముందు చేతులలో అక్షమాల, పుస్తకం ధరించి, ఎడమకాలిపై కుడికాలు పెట్టి అర్ధపద్మాసనంలో కూర్చున్న సరస్వతి అమ్మవారిగా గుర్తించారు. ఈ దేవత తలవెనక ప్రభావళి ఉంది. శైలిని బట్టి ఈ శిల్పం రాష్ట్రకూట, చాళుక్యుల కాలంనాటిది. ఆసనభేదాన్నిబట్టి ఈ దేవత జైనధర్మ ప్రతిమ అయి ఉంటుందని రామ్మోహన్‌ తెలిపారు. వ్యాసపురి(బాసర) ఆలయంలోని సరస్వతి శిల్పాన్ని ప్రసిద్ధ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి జైన సరస్వతిగా భావించారు.

జైన మతంలో సరస్వతి ఆరాధన ఉన్నదని చెప్పడానికి ఉత్తర భారతదేశంలోని మధుర కంకాళిదిబ్బలో పీఠంమీద క్రీ.శ. 2వ శతాబ్దపు శాసనంతో లభించిన తలలేని రెండుచేతుల సరస్వతి శిల్పమే మొదటి ఆధారం. ఇదే దేశంలోకెల్లా తొలిసారి లభించిన సరస్వతి దేవతా విగ్రహం. కొలనుపాకలో దొరికిన శ్రుతదేవి (విద్యాదేవి, సరస్వతి) మరొక ఆధారం. బాసరలోని పాపహరేశ్వర దేవాలయమనే శిథిలమైన గుడిలో లభిస్తున్న శిల్పాలు కూడా జైనధర్మానికి సంబంధించినవి ఎక్కువని అన్నారు. ఈ గుడి మంటప స్తంభాలపై జైనులైన సెట్టిలు వేయించిన లఘు శాసనాలున్నాయి. సరస్వతి శిల్పాలు లభించిన బాసర ఒకప్పటి జైనవిద్యా కేంద్రంగా చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles