Aryan Khan exempted from weekly appearance at NCB షారుఖ్ ఖాన్ తనయుడికి ఊరట.. కొత్త కండీషన్ పెట్టిన హైకోర్టు

No need for aryan khan to appear before ncb every week bombay hc

aryan khan, drugs case, aryan khan news, aryan khan NCB, aryan Khan bombay high court, aryan khan bombay hc, aryan khan case, shah rukh khan, aryan khan lawyer, srk, aryan khan bail, aryan khan drugs case, mumbai police, Mumbai cruise drugs case, Mumbai drugs case, Aryan Khan NCB appearance, Bombay Hight Court on Aryan Khan

Bollywood actor Shah Rukh Khan's son Aryan Khan won't have to appear before the NCB Mumbai office every Friday, as it was mandated by the high court in its bail order, the Bombay high court ruled on Wednesday, modifying the bail order. The high court allowed the waiver but specified that Aryan will have to be present before the SIT Delhi as and when directed, provided the notice is given prior 72 hours.

షారుఖ్ ఖాన్ తనయుడికి ఊరట.. ఆర్యన్ ముందు హైకోర్టు కొత్త షరతు

Posted: 12/15/2021 05:49 PM IST
No need for aryan khan to appear before ncb every week bombay hc

డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రతీ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయానికి వెళ్తున్న ఆయనకు ఇకపై వెళ్లే అవసరం లేదని బాంబే హైకోర్టు తాజాగా అదేశాలను జారీ చేసింది. గతంలో బెయిల్ మంజూరు చేస్తు ఇచ్చిన అదేశాలను తాజాగా అదే న్యాయస్థానం రద్దు చేసింది. అయితే, ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆర్యన్ కు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది.

గతంలో విధించిన షరతును కొట్టేసింది. ఎన్సీబి అధికారి అక్రమంగా కుట్రపన్ని ఆర్యన్ ఖాన్ ను కేసులో ఇరికించారన్న అభియోగాలు నమోదు కావడం.. దర్యాప్తు అధికారి సమీర్ వాంఖేడ్ సస్పెన్షన్ కు గురైన నేపథ్యంలో ఈ కేసును ప్రస్తుతం ఢిల్లీలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాత్రం సహకరించాలని, విచారణకు అవసరమైనప్పుడు పిలిస్తే ఢిల్లీకి వెళ్లాలనే కొత్త షరతు విధించింది. అయితే సిట్ అధికారులు తమ ఎదుట అర్యన్ హాజరుకావాలంటే కనీసం 72 గంటల ముందు ఆయనకు సమాచారం అందించాలని న్యాయస్థానం అదేశించింది.

ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలన్న షరతును కొట్టేయాలని కోరుతూ ఆర్యన్ ఖాన్ వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇవాళ విచారించింది. తాను ప్రతి శుక్రవారం ఆఫీసుకు వెళ్తుంటే మీడియా తనను అనుసరిస్తోందని, పోలీసులనూ వెంటబెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని పిటిషన్ లో ఆర్యన్ పేర్కొన్నాడు. పైగా కేసు ప్రస్తుతం ఢిల్లీలోని సిట్ కు బదిలీ అయినందున ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వాదించాడు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు రావాలన్న షరతును కొట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles