Driver performs CPR on collapsed monkey, rescues it కోతిపిల్లకు సిపీఆర్ విధానంతో ప్రాణం పోసిన మహనీయుడు

Heartwarming video man giving cpr to to revive injured monkey in tamil nadu

TN man valiantly tries to save injured monkey, TN man gives CPR to injured monkey, man gives CPR to monkey, monkey, CPR, first aid, stray dogs, Ambulance driver, residential area, odiyam village, perambalur, Tamil nadu, viral video, heart-warming video

In a heart-warming video, a man is seen trying to save an injured monkey by giving it emergency CPR. The incident took place in Tamil Nadu's Perambalur. A monkey had purportedly entered into a residential area at Odiyam village in Perambalur and was attacked by stray dogs in the region and was in a critical condition.

ITEMVIDEOS: వైరల్ వీడియో: కోతిపిల్లకు సిపీఆర్ విధానంతో ప్రాణం పోసిన మహనీయుడు

Posted: 12/13/2021 06:37 PM IST
Heartwarming video man giving cpr to to revive injured monkey in tamil nadu

తోటి మనుషుల పట్ల కనీసం మానవీయతతో వ్యవహరించని వారు నానాటికీ పెరిగిపోతున్న ఈ కాలంలో.. చిన్నారి కోతి పిల్లకు ప్రాణం పోసేందుకు పరుగు పరుగున వెళ్లిన వ్యక్తి గురించి ఇప్పటు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతను చేసింది సామాన్యమైన పక్రియే అయినా.. దానిని జంతువుపైనా ప్రయోగించడం.. ఇక తన నోటితో కోతి పిల్ల నోట్లో నోరు పేట్టి గట్టిగా ఊపిరినివ్వడం.. వంటి ఘటనలు ఎవరూ చేయలేనివే. అంతేకాదు స్థానికులు కొందరు వీధి కుక్కల దాడిలో కోతిపిల్ల తీవ్రంగా గాయపడిందని.. చెప్పడంతోనే తన పాత స్కూటరుపై వెళ్లిన ఈ అంబులెన్స్ డ్రైవర్ దానిని వెతికి.. పట్టుకుని దానిని ప్రాణం పోశాడు.

ఇక అప్పటికే చివరి దశలో వున్న ఈ కోతిపిట్లను చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అంతే దానిని కిందకు దింపే సరికి అంత్యదశకు చేరి.. కదల్లేని స్థితిలోకి జారుకుంది. వెంటనే తాను కొన్నేళ్ల క్రితం నేర్చుకున్న ప్రాథమిక చికిత్సతో పాటు సీపిఆర్ చేసి.. కోతిపిల్లను కాపాడాడు. అంతేకాదు సృహలోకి రాగానే దానిని వెంటనే వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అది కోలుకున్న తరువాత దానితో సరదాగా మాట్లాడుతూ.. బాధను దూరం చేశాడు. ఇంతకీ ఆ మహనీయుడు ఎవరు.? ఈ ఘటన ఎక్కడ జరిగిందనేగా..? అక్కడికే వస్తున్నాం.

ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అభయారణ్యం వదిలి జనారణ్యంలోకి వచ్చిన ఓ పసిప్రాణి పట్ల వీధి కుక్కలు దారుణంగా ప్రవర్తించాయి. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా పరిధిలోని ఒడియమ్ గ్రామంలోకి ఎనమిది నెలల కోతిపిల్ల రాగానే.. తమ అరణ్యంలోకి చోరబడిందని వీధి కుక్కలు దారుణంగా దాడిచేసి గాయపర్చాయి. దీంతో అప్పటికే గాయపడిన కోతిపిల్ల ఎలాగోలా తప్పించుకుని చెట్టుమీదకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు స్థానికంగా నివసించే అంబులెన్స్ డ్రైవర్ ప్రభు దృష్టికి తీసుకువచ్చారు.

హుటాహుటిన తన స్నేహితుడితో బయలుదేరిన ఆయన గ్రామంలోని చెట్లను వెతికి కోతిపిల్లను గుర్తించారు. ఒక చోట చెట్టుకు అచేతనంగా వేలాడుతన్న కోతిపిల్లను కిందకు తీసుకువచ్చేందుకు చెట్టును గట్టిగా ఊపాడు. ఇలా పలు పర్యాయాలు ప్రయాసాలకోర్చి కష్టపడటంతో ఎట్టకేలకు కోతిపిల్ల కిందపడింది. దీంతో వెంటనే తాను గతంలో నేర్చుకున్న సీపీఆర్ ప్రథమ చికిత్సలను నిర్వహించాడు. అయినా కోతిపిల్ల లెగలేదు, దీంతో దాని నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊపిరి ఊదాడు. అయినా కోతిపిల్ల అచేతనంగా వుంది. దీంతో మళ్లీ అదే విధంగా మూడు, నాలుగు పర్యాయాలు సీపీఆర్ చేయడంతో పాటు ఊపిరి ఊదడం చేశాడు.

దీంతో నాలుగో పర్యాయాం ఊపిరి ఊదగానే కోతిపిల్ల తన తోకను కదిలించింది. దీంతో చలనం రాగానే.. దానిని చంటిబిడ్డలా ఎత్తుకుని.. కొన్ని నీళ్లు తాగించిన తరువాత వెంటనే స్థానిక పశువైద్యుడి కోసం వెళ్లి దానికి చికిత్స చేయించాడు. అక్కడ దానికి చికిత్స చేయించాడు. ఇక అది కోలుకున్న తరువాత దానికి ముద్దులు పెట్టడం.. చక్కగా ఓదార్చడం.. తానున్నాను అన్న అభయాన్ని అందించే చర్యలు చేపట్టాడు. ఇక ఆ తరువాత కోతిని అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. అయితే ప్రభుకు చేసిన పనులన్నీ అతడి వెంట వచ్చిన స్నేహితుడు వీడియో రికార్డింగ్ చేసి..నెట్టింట్లో పెట్టడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. మీరూ ఆ వీడియోలను వీక్షించండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles