Nitish Kumar again demands special status for Bihar ఉపముఖ్యమంత్రిది అవగాహనా రాహిత్యం: సీఎం పరోక్ష వ్యాఖ్యలు

She s clueless chief minister strike at bihar deputy chief minister from bjp

Nitish kumar, bihar special status, special status for bihar, special status category, nitish kumar, bihar, niti aayog, rajiv kumar, Bijendra Yadav, human development, special status to Bihar, Letter to NITI aayog, NITI aayog Report, NITI aayog, Narendra Modi, PM Modi, Nitish Kumar, CM Nitish Kumar, Special Status to Bihar,, Bihar special category status, Central privileges, clue-less, Deputy CM, Renu Devi, Bihar, Politics

Bihar Chief Minister Nitish Kumar did some damage control today over his Deputy Renu Devi's comment that Bihar does not need Special Category status. Without naming the Deputy CM, Nitish Kumar said special status -- which entitles a state to a bunch of Central privileges -- is very essential for Bihar.

ఉపముఖ్యమంత్రిది అవగాహనా రాహిత్యం: సీఎం పరోక్ష వ్యాఖ్యలు

Posted: 12/13/2021 07:31 PM IST
She s clueless chief minister strike at bihar deputy chief minister from bjp

బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు నీటి ఆయోగ్ కు బీహార్ ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించాలన్సిన అవసరం లేదని దీనిపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి.. నితీశ్ ప్రభుత్వంలోని మిత్రపక్ష బీజేపికి చెందిన రేణు దేవి వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలకు వెళ్లాల్పిన తరుణంలోనే నితీశ్ కుమార్ కు రాష్ట్ర అర్థిక పరిస్థితి గుర్తుకువస్తుందని.. ఇందుకోసం ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేయడం జరుగుతుందని అమె ఎద్దేవా చేశారు.

అయితే మరోమారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మీడియాకు వివరించే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఢిప్యూటీ సీఎం రేణుదేవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అమకు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే లబ్ది గురించి అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలతో పాటు కేంద్రం నుంచి పలు రాకాల ప్రివిలేజెస్ కూడా లభిస్తాయని అన్నారు. ఎవరైనా ఈ హోదాను వద్దని అన్నారంటే.. వారికి ఈ హోదా వల్ల కలిగే లబ్దిపై అవగాహన లేకపోవడమే కారణం అవుతుందని అన్నారు.

ఇక బీహార్ రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విషయం విధతమే. ”బిహార్ వెనుక‌బ‌డిన రాష్ట్ర‌మే. ఇది నిజం. ఈ విష‌యాన్ని ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంత‌రం లేదు. అందుకే మేము ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేస్తున్నాం” అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అనేక ర‌కాలుగా తాము ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటికే కొన్ని కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నామ‌ని వివ‌రించారు. జ‌న‌తా ద‌ర్బార్ లో భాగంగా ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ సోమ‌వారం ప్ర‌జ‌ల‌ను క‌లుసుకొని, వారి విన‌తుల‌ను స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే నీతీ ఆయోగ్ కూడా బిహార్ వెనుక‌బడిన రాష్ట్ర‌మే అని ఒప్పుకుంద‌ని, అందుకే తాము ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడుగుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని సంవ‌త్స‌రాలుగా తాము అభివృద్ధికి విశేషంగా తోడ్ప‌డుతున్నామ‌ని, మ‌హిళ‌ల అభివృద్ధికి కూడా పాటుప‌డుతున్నామ‌ని వివ‌రించారు. 2005 త‌ర్వాత తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రం విశేషంగా పురోభివృద్ధి సాధిస్తోంద‌ని తెలిపారు. అలాగే అల్ల‌ర్లు, బందిపోట్లు కూడా త‌గ్గిపోయాయ‌ని నితీశ్ వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles