Farmer protest ends; Delhi borders to be vacated soon: SKM నిరసనలకు బ్రేక్.. మాట తప్పితే మళ్లీ ఉద్యమమే: రైతు సంఘాలు

Farmers call off protest after centre accepts their demands in writing

Supreme Court, lakhimpur kheri, farmers protest, farmers' protest, farm law, Samyukt Kisan Morcha, MSP, Rakesh Tikait, Delhi

The farmers protesting at the borders of the national capital have finally decided to end their year-long movement. This comes in the wake of the Centre accepting all demands put forward by the protesting farmers, including the withdrawal of all agitation-related cases and compensation to the families of farmers who had died during the course of the movement against the contentious agriculture laws.

నిరసనలకు బ్రేక్.. మాట తప్పితే మళ్లీ ఉద్యమమే: రైతు సంఘాలు

Posted: 12/09/2021 05:44 PM IST
Farmers call off protest after centre accepts their demands in writing

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు ఎట్టకకేలకు విజయం సాధించారు. కేంద్రప్రభుత్వం తాము తీసుకువచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకునేలా చేయడంతో పాటు తాము పండించే పంటలకు అత్యధిక మద్దతుధరపై కూడా చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఊరడించి.. తమ వైపు తిప్పు కోవడంలోనూ కేంద్రంలోని పెద్దలు చక్రం తిప్పుతున్నారు. కేంద్రంతో జరిగే చర్చలకు ఐదుగురు సభ్యుల కమిటీని కూడా రైతు సంఘాలు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో కేంద్రంతో వారు జరిపిన చర్చలు కూడా ఫలప్రదమయ్యాయి.

కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు రైతు సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే పూర్తి విర‌మ‌ణ కాద‌ని, తాత్కాలికంగానే విర‌మించిన‌ట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 15న మ‌రోసారి స‌మావేశమ‌వుతామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం త‌మ‌కు కొన్ని హామీల‌ను ఇచ్చింద‌ని, అందుకే త‌మ ఉద్య‌మానికి తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో మ‌రోసారి ఉద్య‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వడం ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇదే విష‌యాన్ని మ‌రో రైతు నేత బ‌ల్వీర్ రాజేవాల్ కూడా నొక్కి చెప్పారు. ప్ర‌స్తుతానికైతే ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోని సింఘూ బార్డ‌ర్‌లోని టెంట్ల‌ను తొల‌గిస్తున్నామ‌ని, త‌మ త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డానికి సన్న‌ద్ధ‌ం అవుతున్నామ‌ని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ సింఘూ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను తాము శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఖాళీ చేయ‌డం ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఇక 13 న స్వ‌ర్ణ దేవాల‌యానికి వెళ్తామ‌ని, 15 క‌ల్లా పంజాబ్‌లోని రైతులు త‌మ ఉద్య‌మానికి తాత్కాలికంగా స్వ‌స్తి ప‌లుకుతార‌ని రైతు అశోక్ ధావ‌లే పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles