సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోవడానికి కారణాలు ఏమిటన్న విషయమై యావత్ దేశం ఉత్కంఠను కనబరుస్తోంది. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో సిడియస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన భార్య, 11 మంది సైనిక అధికారులు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ కొండ గ్రామాలలో నివసించే వారు ముందుగా స్పందించారు.
ఆ గ్రామస్తులలో కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారు. ఆ ప్రత్యక్ష సాక్ష్యులలో ఒకరైన చంద్రకుమార్ అనే గ్రామస్తుడు మాట్లాడుతూ.. “హెలికాప్టర్ కూలగానే ఒక భారీ శబ్దం వినబడింది. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. బయటికి వచ్చి చూస్తే దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. దగ్గరకు వెళ్లి చూడగా.. ఒక హెలికాప్టర్ చెట్ల కొమ్మలపై భారీ అగ్ని జ్వాలలతో చిక్కుకొని ఉంది. అందులో నుంచి కొందరు కాపాడమని గట్టిగా అరుస్తున్నారు. ఏం చేయాలో తెలియక.. నేను నా పక్కింట్లో నివసించే.. శివకుమార్‌ని పిలిచాను అని అన్నాడు.
మరో ప్రత్యక్ష సాక్షి శివకుమార్ మాట్లుడుతూ.. “నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. వాళ్లు రావడానికి సమయం పడుతుందని భావించి 8 మంది గ్రామస్తులతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు పొదల్లో పడి ఉన్నారు. బహుశా.. వారిద్దరూ హెలికాప్టర్ నుంచి దూకేసి ఉంటారు. నేను వారి వద్దకు వెళ్లి చూస్తే వారి వస్త్రాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. వారిలో ఒకరు దాహంగా ఉందని, నీరు కావాలని అడిగాడు. నేను అతడికి ఏమీ కాదని మేము తప్పకుండా సహాయం చేస్తామని చెప్పాను. కానీ ఇదంతా కొండ ప్రాంతం కావడంతో 500 మీటర్ల వరకు వాహనాలు చేరుకోలేవు. అందుకే వారిని అంత దూరం మోసుకొని వెళ్లాల్సి వచ్చింది” అని వివరించాడు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నాక ఎవరినీ అక్కడ ఉండడానికి అనుమతించలేదు. స్థానికులను వారి ఇళ్లలోనే ఉండాలని సూచన చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more