Ex-lover puts sindoor on brides maang on wedding day వరుడి ఎదుటే వధువు నుదుటన సింధూరం దిద్దిన ప్రియుడు..

Jilted lover forcibly applies sindoor in bride s manng during jaimala at her wedding

jilted lover, bride and groom, rejected lover, funny video, viral video, trending video, bride ex lover, Gorakhpur, Uttar Pradesh, social media

During the wedding, as the bride and groom were about to exchange garlands, the bride’s jilted lover turned up at the venue and did the filmiest thing possible. Someone present at the wedding recorded the whole incident and the video is now going viral on different social media platforms.

ITEMVIDEOS: వరుడి ఎదుటే వధువు నుదుటన సింధూరం దిద్దిన ప్రియుడు.. ఆ తర్వాత..

Posted: 12/09/2021 11:53 AM IST
Jilted lover forcibly applies sindoor in bride s manng during jaimala at her wedding

నిజజీవితంలో జరిగే పలు ఘటనలనే సినిమాలు రూపోందించి ఆకట్టుకోవడం దర్శకులకు పరిపాటే. అయితే కొత్తదనంతో సినిమాలను తీయాలన్న యోచనలో పలు ఊహాత్మక సన్నివేశాలను కూడా కలగలపడం పరిపాటే. అయితే ఇలాంటి సినిమాల్లోని ఊహాజనితమైన ఘటనలు నిజజీవితంలో జరిగితే.. ఎలా వుంటుంది. ఎలా ఎదుర్కోంటామన్న అలోచన కూడా లేకుండా కొందరు యువత ప్రయత్నిస్తుంటారు. రెండున్నర గంటల సినిమాలా జీవితాన్ని నూరేళ్ల జీవితానికి అన్వయించుకోవడం ఎంత తప్పో ఈ ఘటన నిరూపిస్తోంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రాతినిథ్య వహిస్తున్న జిల్లాలోని బుద్హట్ తహసీల్ పరిధిలోని హార్పూర్ గ్రామంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అయితే సమయానికి ఆ గ్రామ పెద్ద జోక్యం చేసుకోవడంతో వధువుకు ఎలాంటి పరాభవం జరగకుండా.. వధువు తల్లితండ్రులకు ఎలాంటి భారం పడకుండా.. అనుకున్న ప్రకారం అనుకున్నట్లుగా వధువు వివాహం వరుడితో జరగేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో వరుడి కుటుంబం ఏ మాత్రం వెనక్కు తగ్గినా.. పెద్దల జోక్యం లేకపోయినా.. సమయానికి పోలీసులు రాకపోయినా.. వధువు కుటుంబం పరువు పోవడంతో పాటు.. కుటుంబానికి తీరని నష్టం వాటిల్లేది.

అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. గోరఖ్ పూర్ లో హర్పూర్ లో ఓ యువతి పెళ్లి జరుగుతుండగా.. అమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ప్రేమోన్మాది.. పెళ్లి వేడుకలోకి వచ్చాడు. ముఖం కనబడకుండా ఓ తువ్వాలుతో ముఖంతో పాటు నుదురు చుట్టూ కట్టేసుకున్నాడు. సరిగ్గా వరుడికి హారతినిచ్చిన.. ఆయన పాదాలకు నమస్కరించిన వధువు మెడలో వరుడు పూలమాల వేసే సమయంలో పెళ్లిమండపం పైకి వచ్చిన ప్రేమోన్మాది.. తనతో పాటు తెచ్చుకన్న సింధూరాన్ని చటుక్కున చేతిలోకి తీసుకుని అమె నుదుటన దిద్దాడు. వధువు ప్రతిఘటిస్తున్నా అమె నుదుటన మరోమారు సింధూరం దిద్దే ప్రయత్నం చేయబోగా, అమె బంధువులు అడ్డుకున్నారు.

ప్రేమోన్మాది చర్యలకు తొలుత బిత్తరపోయిన అతిధులు, బంధువులు.. తరువాత అతడ్ని పట్టుకుని బంధించారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రేమోన్మాదిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. కాగా గ్రామపెద్దలు జోక్యం చేసుకుని ప్రేమోన్మాదికి, అతని కుటుంబానికి చివాట్లు పెట్టి.. గట్టిగా మందలించారు. ఇక వరుడి కుటుంబంతోనూ చర్చలు జరిపి మరుసటి రోజు ఉదయం వధూవరులకు వివాహాన్ని జరిపించారు. కాగా, ప్రేమోన్మాది సింధూరం దిద్దిన ఘటనలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles