Amaravati farmers Mahapadayatra reach Srikalahasti on day 39 39వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

Amaravati farmers mahapadayatra reach srikalahasti on 39 day gives break for tomorrow

Amaravati farmers mahapadayatra, SriKalahasti, Tirupathi, MahaPadayatra, Amaravati Farmers, slogans, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Amaravati Farmers Maha Padayatra had reached Srikalahasti on 39th day demanding one state one capital. Today in the noon the Amaravati JAC had decided to give break for today and tomorrow to the Mahapadayatra as the state police had not issued permission for public meeting at tirupati. Hence the JAC leaders are planning to approach AP HIGH Court in this regard.

39వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

Posted: 12/09/2021 01:38 PM IST
Amaravati farmers mahapadayatra reach srikalahasti on 39 day gives break for tomorrow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేస్తున్న న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర ఇవాళ 39వ రోజు కొనసాగుతోంది. పోలీసు ఆంక్షల మధ్య రైతుల మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. క్రితం రోజు చింతలపాలెం నుంచి ప్రారంభమైన ప్రాదయాత్ర ఇవాళ శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైంది. అమరావతి రైతులకు రైతులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ పెద్ద ఎత్తున ప్రజలు పాదయాత్రలో‌ భాగస్వామ్యం అయ్యారు.

ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు యాత్రకు విరామం ప్రకటించారు. తిరుమల వెంకన్నను చేరుకోంటుండటంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో మహా పాదయాత్రను కొనసాగించారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన రైతులు.. అక్కడి నుంచి తిరుమల వైపు యాత్రను ప్రారంభించారు. శ్రీకాళహస్తి చేరుకున్న అమరావతి మహిళా రైతులకు శ్రీకాళశస్తి టీడీపీ మహిళా నాయకురాలు బహుకరించిన సారెతో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి చిత్రపటాలు అందించారు. అంతకుముందు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన బిపిన్‌ రావత్‌తోపాటు ఆయన భార్య, ఇతర అధికారులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం జైజవాన్‌-జైకిసాన్‌ అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. ఇవాల్టి యాత్రలో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం రైతుల మహాపాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. రేపు కూడా విరామం ప్రకటించే అవకాశముంది. తిరుపతిలో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రైతులు నిర్ణయించారు. హైకోర్టు తీర్పు కోసం పాదయాత్రను ఈ రోజు మధ్యాహ్నం నుంచి విరామం ప్రకటించారు. కోర్టు తీర్పును అనుసరించి ఎల్లుండి నుంచి తిరిగి యాత్ర కొనసాగనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles