AP govt bans tobacco products for one year పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra pradesh government bans tobacco products for one year

Andhra Pradesh, andhra pradesh crime news, Andhra Pradesh news, Gutka, Nicotine, tobacco

The Commissioner of Food Safety, Andhra Pradesh, in an order on Monday banned the manufacture, storage, distribution, transportation and sale of Gutkha/Pan masala and chewing tobacco for a period of one year with effect from December 7.

పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Posted: 12/07/2021 09:09 PM IST
Andhra pradesh government bans tobacco products for one year

తెలంగాణ ప్రభుత్వం బాటలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పొగాకు ఉత్పత్తులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రసాయన పొగాకు, గుట్కా, పొగాకు, పాన్ మసాలాల వినియోగంపై ఏడాది పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిషేధం ఈ నెల 7వ తేదీ నుంచి ఏడాది పాటు అమలులో ఉంటుంది. నికోటిన్‌తో కూడిన ఆహార ఉత్పత్తులైన గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గుట్కా లేదా పాన్ మసాలా దినుసులను ఎవరైనా ఏ పేరుతోనైనా తయారుచేసినా, విక్రయించినా, సరఫరా చేసినా, నిల్వ చేసినా ఇకపై నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ హెచ్చరించింది. అంతేకాదు, వీటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఆ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేసిన హైకోర్టు.. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని తీర్పు వెల్లడిస్తూ వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  andhra pradesh crime news  Andhra Pradesh news  Gutka  Nicotine  tobacco  

Other Articles