Cute baby eats whole chicken wing on his own సెరలాక్ తినాల్సిన బడతడు.. చికెన్ వింగ్స్ ఎలా లాగించేస్తున్నాడో..!

Viral video adorable baby eats full chicken wing on his own

adorable baby, chicken wings, toddler chicken wings, chicken wings recipe, baby video, baby video viral, chicken wings recipes, chicken wings stolen, viral video clip, twitter viral video, viral twitter video, viral tweet, viral video, funny video, foodie video, twitter viral video, toddler video

The internet has encountered yet another adorable baby who is winning hearts with his eating skills. Believe it or not, the toddler managed to finish off a whole chicken wing entirely by himself without leaving even a shred of chicken on the bone.

ITEMVIDEOS: సెరలాక్ తినాల్సిన బడతడు.. చికెన్ వింగ్స్ ఎలా లాగించేస్తున్నాడో..!

Posted: 12/07/2021 07:50 PM IST
Viral video adorable baby eats full chicken wing on his own

సామాజిక మాద్యమాల్లో ప్రతీ రోజూ వేలాది వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. కానీ.. అన్నీ వైర‌ల్ కావు. కంటెంట్ ఉన్న‌వే.. ఎంతో ఆసక్తికరంగా ఉన్నవి మాత్రమే వైర‌ల్ అవుతుంటాయి. ట్రెండింగ్ అవుతుంటాయి. టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాయి. అటువంటి వీడియోలలో చిన్నారి బుడతలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. అందులో ఈ వీడియో కూడా ఒక‌టి. ఈ వీడియోను చూసి మీరు మాత్రం న‌వ్వు ఆపుకోలేరు. అంత‌కంటే ముందు నోరెళ్ల‌బెడ‌తారు. ఇంత‌కీ ఏంటా వీడియో అంటారా?

ఓ చిన్నారి బుడతడు.. సెరలాక్ తినాల్సిన వయస్సులో ఏకంగా చికెన్ లాగించేస్తున్నాడు. అందులో ఏముంది అంటారా.. సరిగ్గా ఏడాది వయస్సు కూడా ఉంటుందో లేదో. కానీ.. తన తల్లితో పోటీ పడి మరీ చికెన్ ఫ్రై వింగ్స్‌ను లాగించేశాడు. ఎంతలా తినేశాడో తెలుసా? ఆ పిల్లాడు తినే ప‌ద్ధ‌తి, ఒక్క‌డే చికెన్ వింగ్స్ మొత్తం తినేయ‌డం చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఆ పిల్లాడు చికెన్ వింగ్ మొత్తాన్ని ఏమాత్రం మాంసం మిగ‌ల్చ‌కుండా తినేశాడు. త‌న లేలేత ప‌ళ్ల‌తో లాగి మ‌రీ.. తినేసిన త‌ర్వాత అప్పుడు కూల్ అయ్యాడు. మంచినీళ్లు తాగాడు.

మన భారతీయ తల్లులు తమ పిల్లలు తినడాన్ని, లేదా తాగడాన్ని ఇతరులకు కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వారికి ఎక్కడ దిష్టి తగులుదుందోనని, కానీ ఈ బడుతడి సంస్కృతి, సంప్రదాయం వేరు కాబట్టి అక్కడ వాడి తల్లి వారు తినే విధానాన్ని ఫన్నిగా నెట్ జనులతో షేర్ చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పిల్లాడు గ‌త జ‌న్మ‌లో మంచి తిండి ప్రియుడు అయి ఉంటాడు. 2071 లో ఆ పిల్లాడు ఎలా తింటున్నాడో చూడండి… నీ ప‌ళ్ల‌కు అప్పుడే ప‌ని చెప్పావా?… అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh