HC directions to State police on cases filed against TDP leaders టీడీపీ నేతలపై కేసుల విషయంలో పోలీసులకు హైకోర్టు ప్రత్యేక అదేశాలు

Andhra pradesh high court directions to state police on cases filed against tdp leaders

AP High court, AP State police, immiediete action, TDP leaders, Justice Manavendranath Roy, division bench, issue notices, explanation. YSRCP Govt, Ayyanna patrudu, Chintakayala Vijay, Vangalapudi Anitha, Andhra Pradesh, Politics, Trending video

Andhra Pradesh High court suggests State police not to take immidiete action on the cases filed against TDP leaders, The Court Judge Justice Manavendranath Roy headed division bench directs police to issue notices and ask for explanation.

టీడీపీ నేతలపై కేసుల విషయంలో పోలీసులకు హైకోర్టు ప్రత్యేక అదేశాలు

Posted: 12/07/2021 06:48 PM IST
Andhra pradesh high court directions to state police on cases filed against tdp leaders

టీడీపీ పార్టీ నేతలకు భారీ ఊరట లభించింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేతలకు ఊరట కల్పించేలా.. రాష్ట్ర పోలీసులకు న్యాయస్థానం పలు సూచనలు చేసింది. టీడీపీ నేతలపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్, వంగలపూడి అనిత తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులను పై విధంగా ఆదేశించింది.

సీఆర్‌పీసీ 41ఏ కింద తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించిన కోర్టు.. అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అయ్యన్నపాత్రుడు, ఇతర టీడీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని, పోలీసు వ్యవస్థకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ నర్సీపట్నం ఎస్సై లక్ష్మణరావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు సహా టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh