Leopard enters village near Shirdi, attacks five షిరిడీలో చిరుత అలజడి. ఐదుగురికి తీవ్రగాయాలు..

Viral video leopard enters village near shirdi attacks five persons

Leopard enters village, leopard hulchul in shirdi, leopard hulchul in srirampur at shirdi, leopard in maharashtra, Animal Viral video, Cheetah attack video, Cheetah Hulchu, Shirdi, shrirampur, Maharashtra, Viral Video, Leopard video, Trending News

Panic gripped among the residents of Shriampur in Shirdi, Maharashtra after a leopard entered the village and severely injured five people. According to the sources, a leopard from the nearby forest entered the village and attacked the people. From the video, the leopard is seen attacking a person walking on the road.

ITEMVIDEOS: షిరిడీలో చిరుత అలజడి. ఐదుగురికి తీవ్రగాయాలు..

Posted: 12/06/2021 04:06 PM IST
Viral video leopard enters village near shirdi attacks five persons

కరోనా మహమ్మాది ధాటికి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తుల రాకపోకలు లేవు. కోవిడ్ ప్రోటోకాల్ పేరుతో ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో నిత్యం భక్తుల అలజడి.. వారి వాహనాలు శబ్దాలతో నిత్యంరద్దీగా ఉండే పుణ్యక్షేత్రాలు అసలు రద్దీలేకుండా పోతున్నాయి. ఇక ఈ క్రమంలో దారితప్పిన వన్యప్రాణులు కూడా తమ ఆహారం కోసం గ్రామాల బాటపడుతున్నాయి. తాజాగా సద్గురు సాయినాథుడు కొలువైన షిర్డీ పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీరాంపూర్లో చిరుత అలజడి సృష్టించింది.

అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత ఐదుగురిపై దాడి చేసింది. చిరుత దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముందుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడింది. వెనుక నుంచి దాడి చేయడంతో ఆ వ్యక్తికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. తృటిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత ఓ ఇంటిపై నక్కింది. చిరుత దాడితో వణికిపోయిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందచేశారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది శ్రీరాంపూర్ చేరుకుని దానిని బంధించేందుకు రంగంలోకి దిగారు.

అయితే అటవీశాఖ సిబ్బందితో పాటు స్థానికులను కూడా బొల్తా కోట్టించిన చిరుత వలలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఫారెస్ట్‌ సిబ్బందితో సహా అక్కడ మరో నలుగురిపై దాడి చేసింది. అయినా పట్టువీడని అటవీశాఖ సిబ్బందికి స్థానికులు కూడా తోడుకావడంతో చివరకు చిక్కింది. అటవీశాఖ అధికారులు మరోసారి వల వేయడంతో దానిలో చిక్కింది ఆ చిరుత. దానిపై అటవీశాఖ సిబ్బంది మత్తుమందును ప్రయోగించారు. తరువాత బోనులో బంధించి తీసుకెళ్లారు.  చిరుత హడావిడితో శ్రీరాంపూర్‌లో గ్రామస్థులు కొన్ని గంటలపాటు తెగ టెన్షన్ పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles