Overtaking Tourist Car Crashes Inside Atal Tunnel అతివేగంతో ప్రమాదం.. జరిమానా విధించిన పోలీసులు

Viral video tourist penalised for rash driving inside atal rohtang tunnel

Acident video, overtaking Viral video, over taking accident video, atul rohtang tunnel accident video, Manali-Leh Tunnel Accident video, Himachal Pradesh, Viral Video, Trending News

A tourist car crashed while overtaking inside Atal Tunnel Rohtang. The car passengers suffered minor injuries. On Saturday, a car of tourists from Delhi was going towards North Portal via Atal Tunnel. Then he tried to overtake by going to the second line inside the tunnel. The car went out of control and hit one wall of the tunnel and hit the wall on the other side.

ITEMVIDEOS: అటల్ టన్నెల్ లో అతివేగంతో ప్రమాదం.. జరిమానా విధించిన పోలీసులు

Posted: 12/06/2021 05:07 PM IST
Viral video tourist penalised for rash driving inside atal rohtang tunnel

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లేహ్ రహదారిపై ప్రతిష్టాత్మక అటల్ టన్నెల్ లో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గురైన పర్యాటకులపై స్థానిక పోలీసులు జరిమానా విధించారు. టన్నల్ లోపల ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు కులు పోలీసులు పర్యాటకుల వాహనానికి రూ. 13,500 జరిమానా కట్టాలని చలాన్ జారీ చేశారు. ఈ ఘటన ఈ నెల 4న జరిగినా..ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. DL 10CJ1995 నంబర్ గల కారులో హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వచ్చిన పర్యాటకుల.. అతివేగం కారణంగా సొరంగం లోపల కారు భీభత్సమైన ఫీటు చేసి ప్రమాదానికి కారనమైది. ఈ ఘటన మొత్తం సొరంగం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

మోటారు వాహనాల చట్టం కింద ఈ వాహనాన్ని చలాన్ చేసినట్లు ఎస్పీ కులు గుర్దేవ్ చంద్ శర్మ తెలిపారు. రోడ్డు ప్ర‌మాదాలు ఎంత డేంజ‌ర్ అనేది తెలిసిందే. చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకం కావచ్చు. కారు డ్రైవింగ్ చేస్తున్నంత సేపు అత్యంత ఓపిక, సహనం ఉండాల్సిందే. ఎందుకంటే.. అదే మనకు శ్రీరామరక్ష. డ‌బ్బులు పోతే సంపాదించుకోగ‌లం గానీ ప్రాణాలు పోతే సంపాదించుకోలేం కదా. ఇదే విషయాన్ని ప్రాణాలంటే లెక్కలేని యువతకు కూడా తల్లిదండ్రులు నూరిపోయాలి. యుక్తవయస్సులోనే పెద్దలు చెప్పిన విషయాలతో పాటు చట్టాలు నిర్ధేశించిన విషయాలను పట్టించుకోని యువత ఇబ్బందులను కొనితెచ్చుకుంటుంది.

ఏదో కొంపలు మునిగిపోతున్న‌ట్టు అత్యంత వేగంగా వెహిక‌ల్స్‌ను డ్రైవ్ చేసి చివ‌ర‌కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ప్ర‌మాదానికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. హిమాచల్ ప్రదేశ్ లోని అటల్ ట‌న్నెల్ లో జ‌రిగిన యాక్సిడెంట్ ఇది. ట‌న్నెల్ లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు అత్యంత జాగ్ర‌త్త‌గా న‌డ‌పాలి. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా చివ‌ర‌కు ప్ర‌మాదానికి గురి కాక త‌ప్ప‌దు. కొండచరియలు, హిమపాతంతో ఏడాదిలో దాదాపుగా ఆరు మాసాల పాటు ట్రాఫిక్ అంతరాయానికి కారణం అవుతుంటాయి. దీనిని అధిగమించడానికి భారీ టన్నెల్ ల‌ను ఏర్పాటు చేశారు. అయితే వీటిలో వాహనాలను నిర్ధేశిత వేగానికి మించరాదని హెచ్చరికలు వున్నా.. వాటిని అలక్ష్యం చేసిన యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంది.

అట‌ల్ ట‌న్నెల్ లో అతివేగంగా ప్రయాణించిన కారు ఓవర్ టేక్ చస్తూ వెళ్లి క్రమంలో అదుపుతప్పింది. దీంతో ముందున్న కారును అత్యంత వేగంగా దాటే క్ర‌మంలో ఎడ‌మ వైపు ఉన్న గోడను ఢీకొట్టిది.అక్క‌డితో ఆగ‌కుండా అదే స్పీడుతో అటు ఇటూ తిరుగుతూ మ‌ళ్లీ ఎడ‌మ వైపు ఉన్న గోడ‌ను ఢీకొట్టి ఆ త‌ర్వాత మ‌ళ్లీ కుడివైపుకు వెళ్లి అక్కడే ఆగిపోయింది.కాగా ఈ కారులో ప్ర‌యాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం అయితే జ‌ర‌గ‌లేదు.ఇక ఈ యాక్సిడెంట్‌ను ముందు కారులో ఉన్న వారు వీడియో తీయ‌గా అది కాస్తా నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి ప‌నులు అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles