Vegetarian Husband Worried About Wife Secretly Eating Mutton నెట్టింట్లో వైరల్: కాలమిస్టుకు భర్త రాసిన లేఖ హల్ చల్

Pyaar chahiye ya mutton vegetarian man asks wife after knowing she eats meat

mutton or husband, man asks wife to choose meat or him, mutton or love, mutton, Twitter, Vegetarian, food, wife, food, chicken, wife and husbandviral news, odd news, funny news

In a newspaper clipping that has gone viral, the man shared that his wife enjoys eating meat outside home. Although he was aware of her fondness for mutton before they tied the knot, she had promised to give it up after their wedding. However, he recently found out that his spouse continues to “secretly” eat meat.

నేనా.. మటనా.? తేల్చుకోమ్మన భర్త.. కాలమిస్టుకు రాసిన లేఖ వైరల్

Posted: 12/03/2021 09:06 PM IST
Pyaar chahiye ya mutton vegetarian man asks wife after knowing she eats meat

ఎంత సంపాదించినా.. జానెడు పొట్ట కోసమే. అందుకనే కాబోలు కోటి విద్యలు కూటి కోరకే అన్నారు పెద్దలు. కానీ ఫలానా చేయాలన్నా.. గిరిగీసుకుని దాంట్లోనే ఉండేవారు ఎందరో. జిహ్వాను కట్టడి చేసుకునేవారెందరో. అయితే పూర్తిగా శాఖాహారులైన వారు మాంసాహారాన్ని చూస్తేనే వెగటుగా అనిపిస్తోంది. కానీ కొందరు మాత్రం సమాజంలో శాఖాహారులగా పోజులు కొట్టినా.. తెరచాటుగా తమ మాంసాహారపు అలవాట్లను కొనసాగిస్తుంటారు. ఇందులో మహిళలకన్నా పురుషులే అధికం. బయటకు వెళ్లిన పురుషులు ఎక్కడ ఏం చే్తున్నారన్న విషయం తెలియని భార్యలు అనేకం.

అయితే ఇక్కడ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య మాంసాహారాన్ని లాగించేస్తోంది. ఇదే వారి సంసారంలో చిచ్చుపెట్టింది. ఈ వ్యవహారంలోకి వెళితే.... శాకాహారి అయిన వ్యక్తి తన భార్య కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడు. మాంసాహారం ముట్టని కులం నుంచి ఓ అమ్మాయిని పెళ్లాడాడు. కానీ పెళ్లయిన తర్వాత ఆమె తన నిజస్వరూపం ప్రదర్శించింది. ఇష్టంవచ్చినట్టు మాంసాహారం లాగిస్తూ భర్తను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో ఆ సాధుజీవి హతాశుడయ్యాడు. తన బాధను ఓ కాలమిస్టుతో వెళ్లబోసుకున్నాడు.

ఆ భర్త సదరు వ్యాసకర్తకు రాసిన లేఖ నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... "నేను స్వచ్ఛమైన శాకాహారిని. కులం రీత్యా పూర్తి శాకాహారి అని భావించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆమె తనకు మటన్ తినే అలవాటు ఉందని చెప్పింది. ఆమె అందంగా ఉండడంతో వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత మాంసాహారం జోలికి వెళ్లనని ఆమెతో మాట తీసుకున్నాను. కానీ పెళ్లయిన తర్వాత ఆమె యథాప్రకారం మటన్ తింటోంది.

నా కంటపడకుండా రహస్యంగా బయటికి వెళ్లి మాంసాహారం తీసుకుంటోంది. అదేమని నిలదీస్తే... నేను మటన్ తినకుండా ఉండలేనని తెగేసి చెబుతోంది. దాంతో... నేను కావాలో మటన్ కావాలో తేల్చుకోమని ఆమెకు స్పష్టం చేశాను. కానీ ఇప్పుడు నన్నో భయం పట్టిపీడిస్తోంది. ఒకవేళ ఆమె నిజంగానే మటన్ ను ఎంచుకుంటే నా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఏం ఎంచుకుంటుందని మీరు భావిస్తున్నారు?" అంటూ ఆ భర్త సదరు కాలమిస్టును ప్రశ్నించాడు.

అందుకు ఆ వ్యాసకర్త కూడా అదే రీతిలో నాటకీయంగా బదులిచ్చాడు. "నాకు తెలిసి ఓ భార్య, ఓ భర్త, మటన్ మధ్య ఇదే తొలి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటా. నేను ఏమనుకుంటున్నానంటే... ఎవరైనా ప్రేమ లేకుండా ఉండగలరేమో కానీ తిండి లేకుండా ఉండలేరు కదా! దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి... మీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో!" అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. ఇక ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mutton  husband  mutton or love  mutton  Twitter  Vegetarian  viral news  odd news  funny news  

Other Articles

Today on Telugu Wishesh